Discoverశబ్ద తరంగాలు – ఈమాట
శబ్ద తరంగాలు – ఈమాట
Claim Ownership

శబ్ద తరంగాలు – ఈమాట

Author:

Subscribed: 22Played: 175
Share

Description

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
53 Episodes
Reverse
మన దేశవాళీ వంగ, కర్ణాటక, పంజాబీ సంగీతాలే కాదు, రజని మధ్య ప్రాచ్య సంగీతం ఆధారంగా ఎన్నో పాటలు వ్రాసి స్వరపరిచారు. మధ్య ప్రాచ్య సంగీతం ఆయన స్వభావానికి మరింత దగ్గరైన సంగీతం అనుకుంటాను. ఆయన ఒక సంగీతస్వరం వింటే దానిలో ప్రయోగాలు చెయ్యకుండా వుండేవారు కారు.
ఈ సంచికలో కొన్ని జానపద పాటలు విందాం. ఇవి నిజంగా జానపదుల పాటలా లేక ఆధునిక రచనలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ జానపద వాఙ్మయం మనకు జాతీయవాదం బలంగా వున్న రోజుల్లో సినిమాల్లోను, గ్రామఫోను రికార్డులపైన, ముఖ్యంగా రేడియోలోను చాలా ప్రముఖంగా వినబడేది.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మంగళకైశికి రాగంపై చేసిన ప్రసంగం; లలిత సంగీతం అంటే ఏమిటి? నలుగురు ప్రముఖుల - రజని, మంగళంపల్లి, ఈమని, ఎమ్. ఎన్. శ్రీరాం - అభిప్రాయాలు, ఆలిండియా రేడియో ప్రసారం; మరికొన్ని లలితగీతాలు, ఈ ప్రత్యేక సంచికలో మీకోసం.
వేడుకొంటిని వేలసారులు విసిగించితి మాధవా ఆడుకొమ్మని ఒక్కసారికి అనకపోతిని కేశవా కావుకావని కేకలేసితి కరుణలేదని కూకలేసితి బ్రోవుబ్రోవని బేరమాడితి కడుపు నిండిన గొంతుతో
ఈ పదిహేనేళ్ళలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.
శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.
సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.
ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్‌లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.
ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.
ఈ సంచికలో వినిపిస్తున్న పదహారు పాటలలో, ఒక్క రెండిటిని మినహాయిస్తే, అన్నీ ప్రైవేటు పాటలుగా రికార్డులపైన వచ్చినవి. వైజయంతిమాల సొంతంగా తెలుగులో ఇచ్చిన నాలుగు పాటల రికార్డులు, గాయని ఎమ్. కృష్ణకుమారి, గాయని బి. ఎన్. పద్మావతి పాడిన పాటలు. వీరి వివరాలు తెలిపితే సంతోషం.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు గిడుగు రామ్మూర్తి పంతులుగారిని కలుసుకున్న సందర్భాన్ని వ్యాసరూపంలో, వారి ప్రబుద్ధాంధ్ర పత్రికలో (డిసెంబరు10, 1935) ప్రకటించారు. ఆ వ్యాసపు పఠనరూపం ఇది.
ప్రస్తుతం నా ఆడియో టేపులు, డిస్కులు నాకు అందుబాటులో లేవు. అందువల్ల ఈ నెలలో కూడా మరికొన్ని లలిత గీతాలే అందిస్తున్నాను. ఇవన్నీ విజయవాడ రేడియో కేంద్రం నుండి ప్రసారమవుతున్నప్పుడు వేర్వేరు సమయాల్లో రికార్డు చేసుకున్నవి.
ఈ సంచికలో దాశరథి, భుజంగరాయశర్మ, విశ్వేశ్వరరావు, అడవి బాపిరాజు వంటి ప్రముఖులు రచించిన కొన్ని లలితగీతాలు వినిపిస్తున్నాను. ఓలేటి వెంకటేశ్వర్లు, వేదవతి, ఛాయాదేవి తదితరులు పాడిన ఈ గీతాలు మొదటగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి.
సుగ్రీవ విజయము అనే పేరుగొన్న ఈ యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావుగారి (రజని) శతజయంతి సందర్భంగా ఆయనతో నాకున్న మంచి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ వినిపిస్తున్నాను. రుద్రకవి చరిత్ర, సాహిత్యంపై జరిగిన, జరుగుతున్న చర్చలపై మీకు ఆసక్తి ఉన్నా, లేకపోయినా ఈ సంగీత కార్యక్రమం మాత్రం మీకందరికీ నచ్చుతుందనే ఆశిస్తాను.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ద్విజావంతి రాగంపై చేసిన ప్రసంగం విందాం. హిందుస్తానీ పద్ధతిలో ఈ రాగాన్ని జయజయావంతి అని పిలుస్తారని అనంతకృష్ణశర్మగారు చెప్తారు. శాస్త్రీయ సంగీతం తెలియని వాళ్ళకి సినిమా పాటల భాషలో చెప్పాలంటే ఈ రాగం ఆధారంగా తెలుగు సినిమాల్లో కొన్ని పాటలు వచ్చాయి.
[ఈ సంచికలో శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రచించిన మాట మౌనం (1988) అన్న సంగీత రూపకం సమర్పిస్తున్నాను. దీనికి సంగీతం కూర్చినది శ్రీ కలగా కృష్ణమోహన్. ఈ రూపకంలో రజనీకాంతరావు, మల్లాది సూరిబాబు, బాలకృష్ణప్రసాద్, చదలవాడ కుసుమకుమారి, విద్యుల్లత గార్లు పాడిన పాటలు వినవచ్చు. - పరుచూరి శ్రీనివాస్.]
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
నవంబర్ 2015 సంచికలో బాలానంద బృందం 78rpm రికార్డులపైన, రేడియోలోను పాడిన కొన్ని పాటలు, రేడియోలో సమర్పించిన కొన్ని కార్యక్రమాలు విన్నాం. ఈ సంచికలో మరికొన్ని పాటలు, కథలు విందాం.
loading
Comments