Discoverకథాకమామిషు- Kathaakamaamishu (Telugu Kathalu)
కథాకమామిషు- Kathaakamaamishu (Telugu Kathalu)
Claim Ownership

కథాకమామిషు- Kathaakamaamishu (Telugu Kathalu)

Author: రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ

Subscribed: 4Played: 14
Share

Description

రసజ్ఞులైన తెలుగు సాహిత్యాభిమానులకు అభివందనాలు.
నా చిన్నతనంలో రేడియో ద్వారా మంచి కథలు, కథానికలు, నాటికలు విన్నపుడు అవి నా ఊహాశక్తిని మేల్కొలిపి కన్నులు తెరుచుకుని ఉన్నా ఆ సన్నివేశాన్ని మనసు తెరపై ఆవిష్కృతం చేసేవి. ఆ ప్రేరణతో ఈ శ్రవణ మాధ్యమము ద్వారా నాకు నచ్చిన కథలు, కవితలు, మీ ముందుకు తీసుకుని రావాలనే చిన్న ప్రయత్నం.
10 Episodes
Reverse
కథ: "ప్రత్యక్ష " నరకాలు, రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ   కథా సంగ్రహం:  కరోనా వల్ల గతకొద్దీ నెలలుగా అత్యధికంగా ఒడిదుడుకులకు లొనయ్యిన రంగం విద్యా రంగం. మరీ ముఖ్యంగా ప్రాథమిక విద్య. ఒక్క సారిగా వచ్చిన ఈ మార్పు, పిల్లలను వారి తల్లితండ్రులను అయోమయమానికి గురి చేసింది. అదే సమయంలో చాలా పాఠశాలలు టెక్నాలజీ ని అంది పుచ్చుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేశాయి, చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిగా పరిపక్వము గాని ఆ పసి హృదయాలు దీనివల్ల మానసికంగా శారీరకంగా చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రేరణతోనే దీన్ని ఒక కథాంశంగా మీ ముందుకు తీసుకు రావాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ కథ. నా ఇంతకు ముందు కథలు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంచడమైనది. ఆ లింక్ క్రింద యివ్వడమైనది. https://youtu.be/RXzRJZwaUPA
రాను రానూ సమాజంలో కులం పేరిట, మతం పేరిట మనుషుల మధ్య పెరిగిపోతున్న అడ్డుగోడలు మన దేశాన్ని కొన్ని దశాబ్దాల వెనుకకి తీసుకెళ్లిపోతున్నాయి. ఈ సామాజిక అంశం ఆధారంగా నా భావాలను ఒక కథా రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను.  కథ పేరు : Diversity in Unity రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ
బాల సుబ్రహ్మణ్యం గారికి నేను సమర్పించే  అక్షర సుమాంజలి   By రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ
కథ: మిత్ర ద్వయం- మిరియాల జున్ను (హాస్య కథ), రచయిత: పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి  ఇది ఒక జున్ను ప్రియులయిన ఇద్దరి స్నేహితుల కథ.  చక్కని హాస్య చతురత, స్వచ్ఛమైన తెలుగు సంస్కృతి ప్రతిబింబించే పోలాప్రగడ వారి రచనలు నాకు చాలా నచ్చాయి.వీలయితే మీరు అయన రచనలు చదివి ఆనందించండి.  
స్నేహితుల దినోత్సవం సందర్భంగా నిస్వార్థమైన, నిర్మల మైన స్నేహాన్ని పంచుతూ ఎందరో ఉన్నతికి కారణం అవుతున్న ఎందరో స్నేహితులకి అంకితం ఈ భాగం "గుర్తుకొస్తున్నాయి" శీర్షిక : గుర్తుకొస్తున్నాయి రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ  సంగ్రహం: పుట్టినది మొదలు వార్ధక్యం వరకూ విస్తరించిన అనుభవాల మాలిక  Youtube link: https://youtu.be/RXzRJZwaUPA: Dairy https://youtu.be/QDHWQHyi1nA: India https://youtu.be/lbUEkFlug_Y: Live sessio
కథ: డైరీ లో తనకొక పేజీ,  రచయిత: రవి ఎఱ్ఱాప్రగడ  కథా సంగ్రహం: అర్దాంగి అనగానే ఎప్పుడూ భార్య భర్తలో సగ భాగం అనే అర్ధం చెబుతారు. అందువల్ల భార్యను భర్తకు తగినట్టు నడుచుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ నాకో సందేహం కలిగింది.  అదేమిటంటే భార్య భర్తలో సగ భాగం అయినప్పుడు, భర్త కూడా భార్యలో  సగ భాగం అయినట్టే కదా.  అంటే భర్త కూడా భార్యను  తనతో సమానంగానే చూడాలి కదా. ఈ ఆలోచనలోంచి పుట్టిన కథే "నా డైరీలో తనకొక పేజీ". ఈ కథ ఒక 60 ఏళ్ళ భర్త యొక్క స్వగతంలో నడుస్తుంది.
కథ: భారత్ మాతాకీ జై "షరతులు వర్తిస్తాయి" కథా రచయిత: రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ  కథా సంగ్రహం: కొన్ని వారాల క్రితం మన దేశ సరిహద్దుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ తదనంతర పరిణామాలు, వేరే కోణంలో విశ్లేషించినప్పుడు నాకు ఒకింత ఆవేదనను కలిగించాయి. ఆ ఆవేదనతో నేను వ్రాసిన కథే ఈ "భారత్ మాతాకీ జై "షరతులు వర్తిస్తాయాయి". 
కథ: నాన్న-నీడ , కథా రచయిత : రవి ఎఱ్ఱాప్రగడ  కథా సంగ్రహం:  అమ్మ, నాన్న ఇద్దరినీ వేరు వేరుగా చూడలేము. కానీ ఎవరి స్థానం వారిదే. ఒకరితో ఒకరిని కూడా పోల్చలేము.   ఫాదర్స్ డే సందర్బంగా భాద్యతాయుతముగా ఎంతో  మంది తమ బిడ్డలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నతండ్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ "నాన్న గొప్పతనాన్ని నాకు తోచిన మాటల్లో చిన్న కథ రూపంలో నీకందించే చిన్న ప్రయత్నమే" ఈ "నాన్న నీడ" కథ . మనం ఎంత పెద్ద వాళ్ళమైనా  ఆ నాన్న నీడ మన వెన్నంటే ఉంటూ మన బాగు కోరుతుంది అనే కథాంశంతో రాసిన కథ.  "నాన్న ఒక గంభీర రూపం   నాన్న ఒక అభయ హస్తం   నాన్న ఒక భయం ఒక స్నేహం   నాన్న ప్రతీ బిడ్డకూ ఒక దిక్సూచి"
కథ: "పాఠశాల" అనే ప్రయోగశాల కథా రచయిత: రవి ప్రసాద్ ఎఱ్ఱాప్రగడ  కథా సంగ్రహం: రోజు రోజుకీ మసకబారుతున్న గవర్నమెంట్ స్కూల్స్ వైభవాన్ని పునః ప్రతిష్ట చేయవలసిన భాద్యతను తెలిపే కథ. 
రసజ్ఞులైన తెలుగు సాహిత్యభిమానులకు అభివందనాలు.  ప్రఖ్యాత రచయితల స్పూర్తితో సాహిత్యం పట్ల ఆకర్షితుడనయ్యి,  నేను కూడా ఒక చిన్న కథ వ్రాయాలనే మక్కువతో చేసిన చిన్న ప్రయత్నమే ఈ "పిట్టగోడ" కథ. కథ విని మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతున్నాను. కథా సంగ్రహం:  పదవీ విరమణ చేసి ప్రశాంత జీవితం గడుపుతున్న ఒక ఆదర్శ దంపతుల మధ్య అనురాగాన్ని, ప్రకృతితో వారి అనుబంధాన్ని,  కొన్ని సంఘటనల మేళవింపుతో ఆవిష్కరణ చేసే చిన్న ప్రయత్నమే ఈ కథ.
Comments 
loading