ధ్యానం వల్ల కలిగే కనిపించే , కనిపించని ఫలితాలు ఏమిటి? ధ్యానం చేస్తే మన జీవితలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయి? ధ్యానంతో (meditation) తో నా స్వీయ అనుభవం .. మరిన్ని ఇతర విషయాలు వినండి ఈ సంచికలో ..
బంధాలకు, అనుబంధాలకు కూడా ఒక గ్యారంటీ ఉంటే బావుండు అని ఆశపడే మనకి, వాటిని కూడా insure చేసుకోవాలి అనిపించినదే తడవుగా ఇద్దరు యువకులకు వచ్చిన ఆలోచన, వారు చేసిన ప్రయత్నం ఆధారంగా నేను చేసిన ఈ సంచిక, మిమ్మల్ని కూడా ఆలోచింప జేస్తుందని ఆశిస్తూ, మీ అభిప్రాయాలు కింద ఉన్న ఈ లింకు ద్వారా నాకు తప్పక తెలియజేస్తారని అనుకుంటున్నాను. సంచిక విని మీ feedback తెలియజేయండి. https://sudhamayam-feedback.vercel.app/
దీపావళి నాడు మనం గుర్తు చేసుకుని మన పిల్లలకు చెప్పవలసిన కధలు, అంతరార్ధాలు ..
నేర్చుకునేందుకు సిద్ధమైతే జీవితమే గురువై మనకి దారి చూపిస్తుంది. మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్ళటానికి మీరు సన్నద్ధమై ఉన్నారా లేదా? అన్న ప్రశ్నకు జవాబు మీరే చెప్పుకోవాలి మరి!. ఎందుకంటే జీవితం మీది ..
ఈ కొత్త శీర్షిక లో సమాధానాలు లేని ప్రశ్నలను వేసే కధలు చెప్పాలని ప్రయత్నం. ఈ ప్రయత్నం ఒక శ్రోత వేసిన ప్రశ్నతో ఉత్పన్నమై ఇలా పరిణమించింది. మొదటి కధ మీకోసం..
real మరియూ reel ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం నెమ్మదిగా తరిగిపోతున్న ఈ ప్రపంచంలో మనం అసలు log-off అవ్వగలమా? అవుతున్నామా? అన్న ప్రశ్నకు సమాధానం కాదు గానీ, ఒక సమాలోచన చేశాను ఈ సంచికలో ..
జీవితం లోని చిన్న చిన్న ఓటములకు కుంగిపోయి అది వ్యక్తిగత ఓటమిగా పరిగణించి అదే జీవితానికి తీరని అన్యాయంగా భావించి ఒక సమస్యని ఎదిరించటానికి మరో పెద్ద సమస్యను సృష్టించి ఎదుగుదల వైపు కాకుండా పతనం వైపు వెళ్ళే మానసిక రోగానికి, మనం నిజంగా తలచుకుంటే మందు ఉంది. ఈ అపరాధ భావన, 'ఇక ఇది ఇంతే' అనే ప్రతికూల మనస్తత్వం, ఇక ఎదగము అన్న ఆలోచనల చట్రాన్ని మనం గుర్తించి ఎలా దాటలో చెప్పాను ఈ సంచికలో ..
చుట్టూ ఎందరో ఉన్నా, ఎన్నో వసతులు ఉన్నా, దూరాలు దగ్గరైనా మనిషికి మనిషికి దూరం మాత్రం ఎందుకు పెరిగిపోయింది? దానికి సమాధానం ఏమిటి? చెప్పే ప్రయత్నం చేశాను ఈ సంచికలో ..
నిద్ర తక్కువవటం అంత పెద్ద విషయం కాదని అనుకునే మనకి, అది ఎంత పెద్ద విషయామో తెలిస్తే అది పెద్ద విషయం కాదని అననే అనం .. విషయాలు, విశేషాలు ఈ సంచికలో వినండి
comparison అనే విషయం అంతా భూతం ఏమీ కాదు కానీ అధికమైన comparison మాత్రం ఒక భూతమే. సోషల్ మీడియా చూసి లేదా బయటి ప్రపంచం చూసి మనని మననం తక్కువగా భావించుకుని కుంగిపోయి కొన్ని అక్కర్లేని పనులు చేస్తాం. మరి ఆ అలవాటుని మార్చుకోవాలనుకుంటే ఎలా మొదలు పెట్టాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఈ సంచిక. వినండి మరి..
Colour therapy? పేరు విన్నాం గానీ పెద్దగా details తెలీదు.. క్లుప్తంగా చెప్పు అనే వారికోసం ఈ సంచిక
Icecream ఎలా పుట్టింది? పుట్టిన మొదట్లో ఎలా ఉంది? తర్వాత ఎలా మారింది? వినండి... ఈ సంచికలో
మన చరిత్రలో పురాణాల్లో రక్షాబంధనం ఎలా ఉంది? ఎవరు ఎవరికి రక్షాబంధనం కట్టారు..??
శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో ఉగాది రుచుల వైశిష్ట్యం తెలుసుకునే ప్రయత్నం ఈ సంచికలో