The New City Church Podcast - Telugu

Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!

Still I Rise - నిలిచెదను (Pastor Arpitha Komanapalli)

గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది.  బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి.  మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!

10-01
01:34:35

The Glory of God (Bilingual)

The Glory of God, The Victory of All In this powerful sermon, Pastor Benjamin Komanapalli Jr. talks about the privilege and importance of manifesting God’s glory to see real change in the world around us.  As you listen, we pray that you position yourself on the rock of Jesus and take on the responsibility of showing God’s glory in and through your life. May your life be filled with the glory of God. In Jesus' name, Amen! దేవుని మహిమ, మనందరి విజయము మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును చూచుటకు దేవుని మహిమను మనము కనబరచే ఆధిక్యత మరియు ప్రాముఖ్యతను గురించి ఈ శక్తివంతమైన వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు బోధిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని మీరు సరియైన స్థానంలో ఉంచుకొని, మీ జీవితాలలో, జీవితాల ద్వారా దేవుని మహిమను చూపే బాధ్యతను తీసుకుంటారని మా ప్రార్థన.  మీ జీవితాలు దేవుని మహిమ చేత నింపబడును గాక. యేసు నామములో, ఆమేన్!

09-25
01:05:01

The Path to Divine Destiny -

మీకై ఉన్న దైవిక గమ్యాన్ని చేరుకొనుట: నిజమైన విజయానికి యాత్ర! ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దైవిక గమ్యానికి అర్థం, దానిని చేరుకొనే మార్గాలు, మీకై ఉన్న దైవిక ఉద్దేశ్యాన్ని కనుగొన్న తరువాత చేయాల్సిన పనులను గురించి  ఎంతో స్ఫూర్తిదాయకమైన వర్తమానాన్ని అందిస్తున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా దేవుడు మీకై ఉద్దేశించిన సంగతులు నిరీక్షణ, సమాధానం, మంచి భవిష్యత్తు గురించినవై ఉన్నాయనే సత్యంలో మీరు వేరుపారాలని మా ప్రార్థన! నిజమైన విజయాన్ని చేరుకొనులాగున దేవుని వాక్యానికి మీ జీవితమంతా విధేయత చూపుచు నడిపింపబడుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

09-17
01:07:51

How to fulfill God's Will for your Life? - మీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి?

విధేయతతో నడవడం: దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడం ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుట ద్వారా మనమెలా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చగలమో తెలుపుతున్నారు.   మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని సూచనలు భారమైనవి కాదు కానీ, నీ మంచి కొరకే, నీ గమ్యానికి చేర్చే దారి అని నీవు గ్రహించాలని మా ప్రార్థన.  నీవు దేవుని సూచనలను పాటిస్తూ ఉండగా, ఆయన ఆశీర్వాదం నీతో పాటు వెళ్తూ, నీకు స్థిరమైన విజయాన్ని, దేవునికి మహిమను తెచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

09-12
01:12:24

Discovering God's Plan for your Life - మీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుట

దేవుని ప్రణాళికను తెలుసుకో - నీవెంతో గొప్ప సఫలతను చూస్తావు.  ఈ సందేశములో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నీ జీవితములో దేవుని ప్రణాళికను కనుగొనుటకు వివిధ మార్గాలను తెలుపుతున్నారు.  మీరీ సందేశాన్ని వింటూండగా, మీకై దేవునికున్న  ప్రణాళికను నమ్ముటకు ప్రేరేపించబడి,  విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు ప్రోత్సాహపరచబడాలని మా ప్రార్థన. మిమ్మును మీరు సరైన స్థలములో, సరైన సమయములో కనుగొని, మీ దైవికమైన గమ్యాన్ని చేరుకొందురు గాక!

09-02
01:11:47

God's Plan for your Life - మీ జీవితం కొరకు దేవుని ప్రణాళిక

దేవుని ప్రణాళిక - శ్రేష్ఠమైన ప్రణాళిక  ప్రతి ఒక్కరి జీవితాలు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మన ప్రేమగల సృష్టికర్తచే రూపింపబడ్డాయని, ఆ ప్రణాళికను మనము కనుగొని దానిలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడనే ప్రోత్సాహపూర్వక సత్యాన్ని పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశంలో బోధిస్తున్నారు. దేవుని ప్రణాళికను మనము గుర్తించకపోవుటకు గల కారణాలను పాస్టర్ గారు వివరిస్తుండగా, మీరింత వరకు గడిపిన జీవితాన్ని గురించి ఒక క్షణం ఆలోచించండి. తరువాత మీ పట్ల దేవునికున్న ప్రత్యేకమైన ప్రణాళికను మీకు తెలుపమని దేవునిని అడగండి.  దేవుని మహిమార్థమై, మీరు సరైన దిశలో నడుస్తూ, సరైన గమ్యాన్ని చేరుకొందురు గాక. యేసు నామములో, ఆమేన్!

08-28
01:02:01

It's Time to Grow! - ఇది ఎదుగుటకు సమయం!

ఇది ఎదుగుటకు సమయం! ఈ పాడ్కాస్ట్లో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక విశ్వాసి జీవితంలో ఎదుగుదల ఒక్కొక్కటిగా ఎలా దశలలో జరుగుతుందో వివరిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమ కోసం మీ విశ్వాస జీవితములో ఎవ్వరూ వివరించలేని ఎదుగుదలను చూడటానికి ఆయన సత్య వాక్యము ద్వారా దేవునితో కలిసి మీరు పని చేయడానికి నిర్ణయించుకోవాలని మా ప్రార్థన!

08-26
01:09:56

The Key to Your Breakthrough - మీ విడుదలకు మూలము

మీ నాలుక: మీ విడుదలకు మూలము ఎంతో దైవిక జ్ఞానము ఇమిడియున్న ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తిని మనము ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తున్నారు. మీ జీవితాన్ని మరియు ఇతరులను ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ జీవమునే పలుకుతూ ఉండుటకు ఇప్పుడే నిర్ణయించుకోండి.  మీ మాటలు దేవుని వాక్యానికనుగుణంగా ఉంటూ, మీ జీవితములో మీకు సమృద్ధియైన పంటను ఇచ్చును గాక. యేసు నామములో, ఆమేన్!

08-13
01:15:44

The Principle of Sowing & Reaping - విత్తుట మరియు కోయుట అను సూత్రము

విత్తుట మరియు కోయుటలోని శక్తి! ఈ సందేశంలో, పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వెదకాలము, కోతకాలములు అను బైబిల్ సూత్రాన్ని వివరిస్తుండగా మీ జీవితంలో శాశ్వతమైన మార్పునకు సూత్రాన్ని కనుగొనండి.  మీరు చేస్తున్న పనులనొకసారి పరీక్షించుకొని, వాటిని దేవుని వాక్యానికనుగుణంగా మార్చుకొనడం ద్వారా మీ జీవితము ఎలా సంపూర్ణంగా మారిపోగలదో తెలుసుకోండి.

08-06
51:01

Living the No Condemnation Life - శిక్షావిధి లేని జీవితము జీవించుట

శిక్షావిధి - ఒక భయంకరమైన వేదన నీకు నేనంత మంచివాడను/మంచిదానను కాదు అనిపిస్తుంటుందా? ఏవైనా అంచనాలను చేరుకోవడానికి ప్రయత్నించి ప్రతి సారి ఓటమి పాలయ్యావా? సానుకూల ఒప్పుకోలు చేస్తూ, నిపుణతగల మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ వాటితో ఏం ప్రయోజనం లేక చిక్కుకుపోయినట్లు అనిపిస్తుందా? లేఖనాధారంగా ఉన్న ఈ విడుదలనిచ్చే సందేశంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు ఒక తుది పరిష్కారాన్నిస్తునారు: క్రీస్తుని అంగీకరించి, ఆయన రక్షణలో విశ్రమించుట. తగిన ఉదాహారణలనిస్తూ శిక్షావిధి నుంచి విడుదలై స్వేచ్ఛగా జీవించుట అనేది కేవలం సాధ్యమే గాక అది నిజమైన స్వాతంత్ర్యానికి మూలం అని ఆయన చెపుతున్నారు.  ఈ సందేశాన్ని విని, ఎటువంటి అపరాధ భావన, అవమాన భారము లేని ధైర్యము, శక్తితో కూడిన స్వేచ్చా జీవితాన్ని జీవించుటకు శక్తిని పొందండి. ఆమేన్!

07-30
01:05:06

The Mystery of Christ in you - మీలో ఉన్న క్రీస్తుని గూర్చిన మర్మము

మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయైయున్నాడను మర్మము ఈ వర్తమానంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు సిలువ తర్వాత జీవించుచున్న వారికి ప్రత్యేకంగా ఉన్న గొప్ప ఆధిక్యతను వెల్లడిస్తున్నారు: అది, క్రీస్తు మనలో నివసించుట, మనం ఆయనలో నివసించుట అనే మర్మము. మీరు వ్యాపారస్తులైనా, తల్లిదండ్రులైనా, వైద్య నిపుణులైనా, విద్యావేత్తలైనా, లేదా దేవుని సేవకులైనా, క్రీస్తును మరియు ఆయన సిలువ మరణాన్ని తెలుసుకొనుటపై మీ దృష్టిని కేంద్రీకరించి, దైవిక ఫలితాలను అనుభవించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు క్రీస్తులో ఇది వరకే ఏమైయున్నారో, అలా అవుటకు ప్రయత్నించడం మానివేసి, దేవుని సంపూర్ణతలో నడుస్తూ, ఆయన శక్తిని ఇతరులకు చూపించుదురు గాక. యేసు నామంలో, ఆమేన్.

07-22
01:08:55

Salvation - Our place of Rest - రక్షణ - మన విశ్రాంతి స్థలము

నమ్ముటయే విశ్రమించుట! పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారి ఈ సందేశము ఒక క్రైస్తవునికి ‘విశ్రాంతి’ యొక్క నిజ అర్థం ఏమిటో అనే సత్యానికి మన కళ్ళు తెరుస్తుంది. శత్రువు తీసుకు వచ్చే అబద్ధాలను గురించి ఆయన చర్చిస్తూ, క్రీస్తుతో సహవారసులమైన మనతో దేవుని వాక్యమే మాట్లాడుతుందనే సత్యాన్ని నొక్కి చెపుతున్నారు.  ఇదే మీ విశ్రాంతి దినము. మీరీ వర్తమానాన్ని వింటూండగా, దేవుని వాగ్దానాలను నమ్మి, వాటిలో నడుచుట ద్వారా ఇప్పుడే మీ విశ్రాంతిని మీరు పొందుకోవాలని మా ప్రార్థన.  మీరు మీ స్వంత క్రియల మీద ఆధారపడుట మాని, దేవుని కృప మీదనే సంపూర్ణముగా ఆధారపడి, మీ రక్షణ అనే విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించుదురు గాక. యేసు నామములో, ఆమేన్!

07-16
01:22:15

Life after the Cross - సిలువ తర్వాత జీవితము

ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు బైబిల్‌లోని గత మరియు ప్రస్తుత సత్యాలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, వాటిని అర్థం చేసుకోవడంలో సందర్భం మరియు సమయాన్ని వివేచించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుడు మనకిచ్చిన సమృద్ధి జీవితాన్ని దోచుకునే సంప్రదాయాలను తిరస్కరించాలని మరియు సిలువ తర్వాత క్రీస్తు మనకిచ్చిన జీవితము మనము జీవించడము గొప్ప భాగ్యం, ఆధిక్యత అని మనము గ్రహించాలని మా ప్రార్థన. దేవుడు ఈ కాలములో చేస్తున్న దానంతటికీ మీ కళ్ళు, చెవులు, హృదయము ఎల్లప్పుడూ తెరచి ఉండును గాక. యేసు నామములో, ఆమేన్!

07-09
01:18:17

What is Pentecost Sunday? - పెంతెకొస్తు ఆదివారం అంటే ఏమిటి?

పరిశుద్ధాత్మ అగ్ని - విశ్వాసి యొక్క ఆయుధం మరియు హృదయవాంఛ ఈ పెంతెకొస్తు ఆదివార ప్రసంగంలో, పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు పెంతెకొస్తు దిన ప్రాముఖ్యతను, దేవుని వాక్యానికి మరియు ఆయన ఆత్మకు మధ్య ఉన్న అవినాభావ బంధాన్ని మరియు అన్య భాషల్లో మాట్లాడే రుజువుతో పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి నింపబడవలసిన ఆవశ్యకతను తెలుపుతున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, పరిశుద్ధాత్మ సన్నిధి మీలో వెలిగింపబడి, దేవుని మహిమార్థమై రోగులను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని లేపుటకు మీరు శక్తినొందుదురు గాక. లోకము మీ ద్వారా అందరినీ దేవుని ప్రేమ మరియు శక్తితో వెలిగించు పరిశుద్ధాత్మ యొక్క రూపాంతర శక్తిని చూచును గాక. యేసు నామములో, ఆమేన్!

06-10
01:19:05

Redemption - The Open Door to the Blessing విమోచన - ఆశీర్వాదమునకు తెరువబడిన ద్వారము

ఈ సందేశంలో పాస్టర్ బెన్ కొమానపల్లి జూనియర్ గారు విమోచన మనకు దేవుని ఆశీర్వాదమనే ద్వారంగా ఎలా మారుతుందో తెలుపుతున్నారు. ఇక్కడ వారు శాపాలు, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ, శాపాలు కాదు కానీ, ఆశీర్వాదాలే మన పట్ల దేవుని ప్రణాళిక అని మనకు తెలియజేస్తున్నారు. దేవుడు మన క్షేమాన్నే కోరి, మనలను ఆశీర్వదిస్తాడు. క్రీస్తు మనలను శాపము నుండి విమోచించి, మనము ఆశీర్వదించబడునట్లుగా తానే శాపముగా మారాడు.  ఒక విశ్వాసి ఏ శాపగ్రస్తమైన పరిస్థితి లేదా సందర్భము కింద జీవించాల్సిన అవసరం లేదు. ఈ సత్యాన్ని విశ్వాసమే తెరుస్తుంది.

06-03
01:11:30

Faith in God - దేవునియందలి విశ్వాసము

కేవలము నమ్ము. సుళువుగా పొందుకో.  ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు క్రైస్తవ జీవనము గురించిన ఒక ఆవశ్యకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు: దేవునికి ఇష్టులైయుండుటకు విశ్వాసం ద్వారానే మనము నడవడం తప్పనిసరి. మీరీ వాక్యము ద్వారా ప్రేరణ పొంది, క్రీస్తు కథను అతి క్షుణ్ణంగా అభ్యసించి ఆయన మాదిరిని సాధన చేయడానికి నిర్ణయించుకోవాలని మరియు ఏది ఏమైనా సరే విశ్వాసం ద్వారానే స్థిరంగా నడుస్తూ ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. దేవుని మహిమ కొరకు మీ విశ్వాస జీవితం ఇతరులకు ఒక మాదిరిగా ఉండుగాక. ఆమేన్!

05-28
01:04:07

The Responsibility Of Motherhood - తల్లి యొక్క బాధ్యత

మాతృత్వము: ఒక ధన్యకరమైన పిలుపు  పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు మాతృ దినోత్సవం సందర్భంగా ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని పంచుకుంటున్నారు. తమ పిల్లల విశ్వాసాన్ని రూపొందించడంలో మరియు క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఇతర యవ్వన స్త్రీల ఆత్మీయ వృద్ధిని పెంపొందించడంలో క్రైస్తవ తల్లులకున్న కీలక పాత్రను ఆయన నొక్కి చెబుతున్నారు. మీరీ వర్తమానాన్ని వింటూండగా గతంలో ఎదుర్కొనియున్న ఏదైనా గాయం నుండి మీరు స్వస్థత పొందాలని మరియు దేవుని కృప ద్వారా మీరు ముందుకు సాగడానికి శక్తి పొందాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ పిల్లల కొరకు మీరు దైవిక వారసత్వాన్ని వదిలి వెళ్లి, వారు మీ నిస్వార్థ ప్రేమ, అంకితభావం మరియు విశ్వాసాన్ని కృతజ్ఞతతో కొనియాడుదురు గాక. యేసు నామంలో, ఆమేన్!

05-20
01:07:09

Recommend Channels