DiscoverAndhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Teluguధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 27 (ఆడియోతో…)
ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 27 (ఆడియోతో…)

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 27 (ఆడియోతో…)

Update: 2025-01-29
Share

Description

<figure class="wp-block-audio"></figure>



పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ…





27.
దు:ఖ దారిద్య్ర దౌర్భాగ్య పాప ప్రక్షాళనాయ చ
కామ క్రోధ జయార్ధం హి కలౌ ధర్మోయమీరిత:





దు:ఖము, దారిద్య్రము, దౌర్భాగ్యము, పాపము ఇవి తొలగించుకోవాలనుకునే వారు కామమును, క్రోధమును జయించాలి. అందుకనే వారు కలియుగమున శ్రీ మద్భాగవతమును సేవించుటే ధర్మముగా తలచవలెను. పూర్వ జన్మలో చేసిన పాపములే దు:ఖమును, దారిద్య్రమును, దౌర్భాగ్యమును కలిగించును. పాపం వలనే వ్యాధులు సంభవించును. వ్యాధుల వలన దు:ఖము కలుగును. పాపం చేయుట వలనే మనకు కావలసిన వారితో యెడబాటు, ఇష్టము లేని వారితో కలయిక కలుగును. అయిన వారు దూరం కావడం, కానివారు ఎదురుపడడం ఈ రెండు దు:ఖాన్నే కలిగిస్తాయి. అనుకున్న కోరిక నెరవేరక పోవడం, వద్దన్న ఆపద రావడాన్ని దౌర్భాగ్యం అంటారు. ఇలా దు:ఖమునకు, దారిద్య్రమున కు, దౌర్భాగ్యమునకు పాపమే కారణం. ఆ పాపము భాగవతమును చూసినా, చదివినా తొలగిపోవును. పాపం తొలగితే దు:ఖము, దౌర్భాగ్యం, దారిద్య్రము అన్నీ నశిస్తాయి. శరీర రోగాలు, మానసిక రోగాలన్నీ తొలగి నిత్య సంతుష్టిగా ఉండును. అందుకే కలియుగంలో భాగవత సేవనమే
ధర ్మము.





కలియుగమున మానవుడికి ప్రధానమైన శత్రువులు కామము, క్రోధము. ఒక వస్తువు కావాలి అనుకొనుటే కామము అనగా కోరిక, కోరిక నెరవేరకుంటే వచ్చేది కోపము. తాను కోరనది అందుకున్నా, కోరిక లేని వానిలో కోరిక కలిగించాలి అనుకున్నా కోపమే వస్తుంది. కావాలి అనేది ఎలా కోరికో
నాకేమి వద్దు అనేది కూడా కోరికే. వద్దనుకున్నపుడు దానిని అందించడం కూడా కోరిక తీరక పోవడమే అవుతుంది. దాని వలన కూడా కోపం వస్తుంది. అసలు కావాలనుకోవడమే కోరిక. వద్దనుకున్నది వచ్చినా కావాలనుకున్నది రాకున్నా కోపం వస్తుంది, అందుకే కోరిక కంటే కోపం గొప్ప శత్రువు. భాగవతాన్ని సేవించిన వారికి ఒకటి కావాలని ఒకటి వద్దని ఉండదు, భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడు తీసుకున్న దాన్ని కూడ ఆయన దయ గానే భావిస్తారు. అంతా భగవంతుని దయే అన్న భావన భాగవత సేవనం వలన కలుగుతుంది. అందుకే భాగవత సేవనం కామ క్రోధములను జయించ కలుగుతుందని చెప్పారు.





– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి



Source

Comments 
In Channel
loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 27 (ఆడియోతో…)

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం – 27 (ఆడియోతో…)

Pravallika Battu