DiscoverMak Talksవిద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం
విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

Update: 2023-09-09
Share

Description

విద్యార్థి - బాలల దినోత్సవ నాటకం నవంబర్ 2023

ఉపోద్ఘాతము - భారతదేశం. భాగ్యోదయ దేశం. సువర్ణ భారతదేశం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలనుంచి, ఎందరో వీరులు మరెందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన ఈ సర్వసత్తాక గణతంత్ర స్వరాజ్యం. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి పథంలో నూతన ఆవిష్కరణలకు బీజం పోస్తున్నారు. మనం మాత్రం ఇలాగే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని తరతరాలుగా చెప్పుకుంటున్నాము. కారణం అవినీతి, నిర్లక్ష్యం, సోమరితనం, పేదరికం. ఏనాడైతే దేశ యువత ఈ నాలుగు అధర్మ పాదాలను కూకటివేళ్ళతో సహా పెకిలించివేస్తుందో, ఆనాడే మన దేశం, అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేసే చిన్న ప్రయత్నమే మా ఈ విద్యార్థి. ఇది కల్పితం కాదు. మన చుట్టూ ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించిన చిన్న నాటక ప్రయోగం మాత్రమే. ఇది ఎవర్ని ఉద్దేశించి రాసినది కాదు. ఇది ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్ననూ, ఎవరి మనసునైనా నొప్పించినట్లైననూ సాదరాభిమానంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ నవయువ సారథులం. గురుకులం వారథులం.

నాటక సమయం - 5 నిమిషాలు

పాత్రలు - విద్యార్థి, మంచి, చెడు, సోమరిపోతు, బిక్షగత్తె, రాజకీయ నాయకురాలు (అబ్బాయిలైనా, అమ్మయిలైనా ఎవరైనా చేయవచ్చు)

మొత్తం సంభాషణలు - 33
విద్యార్థి సంభాషణలు - 7
మంచి సంభాషణలు - 11
చెడు సంభాషణలు - 9
సోమరిపోతు సంభాషణలు - 2
బిక్షగత్తె సంభాషణలు - 2
రాజకీయ నాయకురాలు సంభాషణలు - 2

సంభాషణలు

విద్యార్థి - కష్టపడి డిగ్రీ పట్టా సాధించేశా. ఈ పట్టా చూపిస్తే అమ్మానాన్నలు చాలా సంతోషిస్తారు. ఇలాగే కష్టపడి ఒక మంచి ఉద్యోగం కూడా సాధిస్తే ఇక జీవితంలో సెటిల్ అయినట్లే (అనుకుంటూ సంతోషపడుతుంటే తనలోనుంచి మంచి కుడివైపు నుంచి మరియు చెడు ఎడమవైపు నుంచి బయటికి వచ్చి హాహాకారాలు చేస్తాయి.)

విద్యార్థి - (భయంతో)ఎవరు మీరు?

మంచి - నేను నీలోని మంచిని మిత్రమా!

చెడు - నేను నీలోని చెడుని బ్రో!

విద్యార్థి - నాలోని వారా? (ఆశ్చర్యంగా)

మంచి - అవును. నేను నిన్ను మంచి మార్గంలో నడిపించే నీ అంతరాత్మను.

చెడు - నేను నీలోని రాక్షసత్వాన్ని రగిలించే ప్రేతాత్మను. హహ్హహ్హహ్హహ్హహ

విద్యార్థి - మరైతే! మీరిప్పుడు ఎందుకొచ్చారు?

మంచి - బాగా కష్టపడి అమ్మానాన్నల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. నిన్ను మంచి దారిలో నడిపించి నిన్నొక గొప్ప వ్యక్తిగా మార్చడానికే నేనొచ్చాను.

చెడు - ఆ.....ఏం గొప్ప? ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అంతా డ్రామాలే. పైన పటాసు లోన లొటాసు. తన మాటలు వదిలి పెట్టు. ఇన్నాళ్లు పడ్డ కష్టం చాలు. ఇప్పటికైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం బ్రో. ఛలో! సిగిరెట్, మందు, గంజాయి, డ్రగ్స్. ఏం కావాలన్నా మనదే. మనీ ఉంటే ప్రపంచమే మన బానిస. తగ్గేదెలా!

సోమరిపోతు - (కడుపు నిండా ఫ్రీగా పెట్టిన ఫుడ్డు తిని, చేతులు నాక్కుంటూ, ఆవురుమంటూ తేన్పుతూ, పడుకోవడానికి చోటు వెతుక్కుంటూ, విద్యార్థి కాళ్ళపై వాలుతూ) ఫ్రీగా ఫుడ్డు పెట్టేందుకు కూడా ఇంతసేపు నిలబెట్టిస్తే ఏం చేసేది? కాసేపు కూర్చుందాం. కడుపు నిండా తిన్న తర్వాత కాసేపు పడుకుంటే సరి.

విద్యార్థి - ఎవరు నువ్వు? ఇక్కడ పడుకుంటున్నావేంటి? ఇదేం నీ బెడ్రూం కాదు.

మంచి - చూస్తుంటేనే తెలుస్తోంది పెద్ద సోమరిపోతని. కష్టపడకుండా ఫ్రీగా వచ్చే ఫుడ్డు తింటూ రోజులు గడిపేస్తోందనుకుంటా.

చెడు - ఇదీ కదా లైఫ్ అంటే. ఇంట్లో వాళ్ళ గోల లేదు. వంట చేసుకునే అవసరం రాదు. ఉద్యోగం లేదు. జీతం రాదు. EMIలు లేవు లోన్లు లేవు. మహానుభావులు. రాజభోగాలు అనుభవిస్తున్నారు.

మంచి - ఇందుకే అన్నారు మహాకవి శ్రీ శ్రీ. ఎముకలు వంగిన ముతకల్లారా చావండి. రక్తం మరిగే యువకుల్లారా లేవండి. పదండి ముందుకు. పదండి దూసుకు. పదండి పోదాం పైపైకి.

చెడు - పోవాల్సిందే పైపైకి. ఎక్కడికి దూసుకుపోతావ్. నువ్వు ఎక్కడికీ పోయే అవసరం లేకుండానే ఇల్లు ఫ్రీ, నీళ్లు ఫ్రీ‌, రేషన్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని మన ఇంటి ముందుకే అన్ని వస్తుంటే. మనమింకేం చెయ్యాలి. కూర్చుని తినడం, అరిగేదాకా తిరగడం, ప్రశాంతంగా నిద్ర పోవడం. కాబట్టి అవన్నీ వదిలేసి తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? అని మాత్రం ఆలోచిస్తే చాలు. మిగిలిన వన్నీ అలా అలా అలా అలా అయిపోతూ ఉంటాయి.

సోమరిపోతు - ఇదేదో మెంటల్ కేస్ లా ఉంది. ఇక్కడే ఉంటే ఆ పిచ్చి నాక్కూడా ఎక్కుతుంది. నేను పడుకోవడానికి వేరొకచోటు చూసుకోవాలి(అంటూ వెళ్ళిపోతుంది.

బిక్షగత్తె - అమ్మా! అమ్మా! నాకొక వందరూపాయలుంటే ధర్మం చేయండి. గూగుల్ పే, ఫోన్ పే, పేటియమ్ ఎనీ యుపిఐ సర్వీస్ అవైలబుల్.

మంచి - ఈమెవరో ప్రోఫెషనల్ బెగ్గర్ లా ఉంది.

చెడు - ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే, చుట్ట కాల్చుకోవడానికి అగ్గి లేదని ఇంకొకరు ఏడ్చారంట. ఆ డబ్బులే మన దగ్గరుంటే మనమెందుకు ఇక్కడుంటాం. వీలైతే ఈమె దగ్గరే డబ్బులు దోచేయ్.

మంచి - దొంగతనం మహ
Comments 
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

విద్యార్థి - 2023 బాలల దినోత్సవం నాటకం

Manikanta Kamatam Gurukulam Acharya