Greek Mythology in Telugu_పాతాళాధిపతి హెడిస్ ప్రేమకథ...| స్టోరీ 7 |Hades Premakatha from Greek Myth
Description
ఈ కథ కోసం మనం కొంచెం సేపు పాతాళానికి వెళదాం. Cronus నుండి అధికారం లాక్కున్న తరువాత అతని ముగ్గురు కొడుకులు, భూమిని మీద పాలనని తమ మధ్య పంచుకున్నారు. జియుస్ ఆకాశాన్ని, భూమిని పైన ఉన్న జీవజాతికి అధిపతిగా మారితే, Posideon సముద్రాలని, అందులో ఉన్న జీవ జాతులను ఆక్రమించుకున్నాడు. ఇక మిగిలిన భూ అంతర్భాగంలో ఉన్న పాతాళ లోకం యోక్క అధికారాన్ని హెడిస్ చేజిక్కిచ్చుకున్నాడు. మొదట్లో తన భాగం కింద శూన్యం తో నిండి ఉన్న పాతాళం రావడాన్ని అస్సలు ఇష్టపడలేదు హెడిస్, కానీ జియుస్ “భవిష్యత్తులో భూమి మీద ఉన్న ప్రతి జీవ జాతి చివరికి పాటలానికే రావాల్సి వస్తుంది, వారందరూ నీ పాలనలో ఉంటారు” అని నచ్చ చెప్పడంతో, తన పదవిని అభిమానించడం మొదలుపెట్టాడు హెడిస్. భవిష్యత్తులో తన పాలనలోకి వచ్చే ఆత్మలకోసం పాతాళం లో మూడు లోకాలను సృష్టించాడు అతను, అందులో ఒక లోకంలో అద్భుతంగా, ధైర్యంగా, వేరేవారు మంచికోసం బ్రతికిన వారిని ప్రశాంతంగా గడపడానికి పంపితే, రెండవ లోకంలోకి మామూలుగా, సాధారణంగా, బ్రతికిన వారిని పంపేవారు. చివరిగా మూడవ లోకంలోకి, పాపాలు చేసి, పక్కవారిని నాశనం చేసీ వారిని శిక్షించేందుకు పంపేవారు, మనకి నరకం ఎలాగో, ఆ మూడవ లోకం అలాగా.























