Wealth Transfer - సంపద బదిలీ
Description
దేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి.
ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు:
• సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా.
• దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము.
• విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు?
• దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు.
• పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు?
మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!



