Discoverసమాచారం సమీక్ష - A Telugu News Podcast
సమాచారం సమీక్ష - A Telugu News Podcast
Claim Ownership

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Author: Suno India

Subscribed: 9Played: 45
Share

Description

ఈ పోడ్కాస్ట్ సిరీస్‌లో చర్చలు, వార్తల సమీక్ష, మరియు మీడియా విమర్శని ప్రసారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తలకు ప్రాధాన్యత ఉంటుంది. మీ సలహాలు, తెలుగులొ మీరు వినాలి అనుకునె విషయాలు గురించిన వివరాలు మాకు తెలపాలి అనుకుంటె, hello@sunoindia.in (mailto:hello@sunoindia.in) కి email పెట్టండి.

(Samacharam Sameeksha will bring to you news and views of all the latest developments from Telangana and Andhra Pradesh. The podcast will also analyse news coverage and bring in seldom heard perspectives and will help you cut through the noise. Priority will be given to issues from the two Telugu states. Write into us at hello@sunoindia.in with your suggestions and feedback.)
27 Episodes
Reverse
(కోవిడ్ 19 గత ఏడాది పాటుగా ప్రపంచవ్యాప్తం గా చేసిన చేస్తున్న విలయ తాండవం నుండి ఉపశమనం కలిగించే Covid టీకా రాకకోసం చూసిన ఎదురుచూపుల కు తెరపడింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఆసుపత్రులలో దేశప్రజలకు వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.  టీకా కోసం ఎలా ఎక్కడ రిజిష్టర్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్  కావాలి, టీకా సెంటర్ లో వసతులు వంటి విషయాలను మనం ప్రభుత్వ  ప్రైవేట్ హాస్పిటల్స్ లో టీకా వేసుకున్న  వారి అనుభవం షో హోస్ట్ D.chamundeswari తో శ్రీమతి G.Vijaya , రాజేశ్వరి ఉన్నవ వివరించారు.) The wait of the last one year COVID-19 vaccine has finally come. The public is finally being vaccinated in government and private hospitals. In this episode host D. Chamundeswari talks to G.Vijaya and Rajeswari Unnava who have got themselves vaccinated on how to register for the vaccination, which documents need to be carried, how are the facilities in the vaccination centres among other general questions. See sunoindia.in/privacy-policy for privacy information.
చరిత్ర అడక్కు చెప్పింది విను కాకుండా చరిత్ర పుటల్లోకి తొంగిచూసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అవసరం. హిస్టరీ లోని మిస్టరీని సరైన పద్ధతి లో సాల్వ్ చెయ్యటానికి ఉన్న శాస్త్రీయ దృక్పథం పద్ధతులు ,ప్రాచీన కట్టడాలు శిధిలాల పరిరక్షణ  ,చరిత్ర వక్రీకరణ ఆపటం ఎందుకు అవసరమో భిన్నురి మనోహరి గారు హోస్ట్ చాముండేశ్వరి గారి తో చెప్పారు. (Instead of just listening to versions of history, it is necessary to investigate and try to find out the facts. Bhinnuri Manohari told host Chamundeshwari about the scientific approach to solving the mystery of history in the right way, the need to stop the destruction of ancient monuments and the distortion of history.) See sunoindia.in/privacy-policy for privacy information.
COVID-19 ని పాండెమిక్ గా ప్రకటించి తొమ్మిది నెలలు పూర్తయాయ్. ఈ వ్యాధి గురించి కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక అంశం – లాంగ్ కోవిడ్. సాధారణంగా ఈ వ్యాధి సోకినా వాళ్ళు రెండు లేదా మూడు వారాల్లో కోలుకుంటారు.  కొద్దిమంది పేషెంట్స్ లో మాత్రం ఈ వ్యాధి తాలూకు లక్షాణాలు, లేదా ఈ వ్యాధి వళ్ళ వచ్చిన complications రెండు-మూడు నెలలు లేదా ఇంకా ఎక్కువ కాలం కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ గా పిలవబడుతున్న ఈ వ్యాధి గురించి  సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సమాచారం సమీక్ష ఈ ఎపిసోడ్ కోసం హోస్ట్ అయిషా మిన్హాజ్ ఇంటర్నల్ మెడిసిన్ ఎక్సపర్ట్ డాక్టర్ ఎస్. వి. ప్రశాంతి రాజు గారి తో మాట్లాడారు. డాక్టర్ ప్రశాంతి గారు రెండు దశాబ్దాలకు పైగా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిటీ లో పని చేస్తున్నారు. ప్రస్తుతం,  అపోలో హాస్పిటల్ లో COVID-19 రికవరీ క్లినిక్ కి ఇన్-ఛార్జ్ గా భాద్యత వహిస్తున్నారు. (It’s been nine months since COVID-19 was declared a pandemic. One issue that came to light a few months ago about this disease is Long COVID. Most COVID-19 patients usually recover in two to three weeks. In a few patients, the symptoms of the disease, or complications from the disease, last for two to three months or even more. This episode of Samacharam Sameeksha tries to answer a few basic questions about the occurrence of Long COVID, care, and caution. For this episode of Samacharam Sameeksha, Ayesha Minhaz spoke to internal medicine expert Dr. SV Prashanthi Raju. Dr. Prashanthi has experience of over two decades and is currently leading the COVID-19 recovery clinic at Apollo, Hyderabad.) See sunoindia.in/privacy-policy for privacy information.
ఏలూరు వింత వ్యాధిపై వైద్య నిపుణులు కారణాలు ఇంకా తేల్చలేదు. అయితే సునో ఇండియా గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రాధమికంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ప్రజలు అనారోగ్యాలపాలు అవుతున్నట్లు తెలుస్తోంది.  సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం, కూరగాయాల్లో పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉండటం, ఆక్వా సాగు లో వినియోగిస్తున్న ఎరువులు మోతాదుకు మించడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుందన్నది ఈ సంచలన సంఘటన రుజువు చేస్తోంది. నిపుణులు అంతిమంగా ఇచ్చే నివేదికల్లో అసలు విషయాలు ఈ మిస్టరీని ఛేదించనున్నాయి. ఏది ఏమైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ప్రజారోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలిసిన బాధ్యత ను ఏలూరు వింత వ్యాధి పాలకులకు గుర్తు చేస్తుంది. (Medical experts have not yet determined the causes of the Eluru mystery disease. However, the Suno India Ground Report shows that people are getting sick primarily due to contamination of drinking water and food. This sensational event proves that the lack of proper drainage system, lack of clean drinking water, overdose of pesticide residues in vegetables and overdose of fertilizers used in aquaculture are ringing the alarm bells. The real issues in the final reports given by the experts will solve this mystery. Eluru outbreak reminds us of the responsibility of the government to be constantly vigilant about public health and make sure that it doesn’t get repeated. This episode was reported by Ram Narayanana, independent journalist, Rajamundhry.) See sunoindia.in/privacy-policy for privacy information.
డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల సందర్భంలో, పార్టీలు ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల జాబితా రోజు రోజు కి పెరుగుతూ ఉంది. వీటిలో కొన్ని కలహాలు రేపే విధంగా ఉంటే, కొన్ని GHMC పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీలు – తెరాస, ఎం.ఐ.ఎం, బీజేపీ – మధ్య హోరా హోరీగా  ఎన్నికల  ప్రచారం  సాగుతుంది. వీటన్నింటి నడుమ, అసలు ప్రజలు కోరుకునే సౌకర్యాలు, కనీస వసతులు ఏంటి అనే అంశాల గురించి నేటి చర్చ. ఈ వారాం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో, అయిషా మిన్హాజ్ ప్రజల నుండి సేకరించిన అభిప్రయాలని చర్చిస్తాము. (With GHMC elections scheduled to be held on December 1, the sops being showered are increasing, some growing absurd by the day. The three leading contenders — TRS, MIM, BJP — are engaged in a highly charged election campaign. Considering that this an election that impacts the basic amenities part of our lives, Suno India contributor Ayesha Minhaz spoke to people to find out what they want from this election and from GHMC. Excerpts from the contributions from the people are presented in this episode.) See sunoindia.in/privacy-policy for privacy information.
380 ఎకరాల వైశాల్యంలో నెలకొని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్య ఆకర్షణ. సాధారణంగా విజిటర్లతో కళకళలాడే జూ, కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఏడు నెలలపాటు మూసివేయబడి, ఈ మధ్యనే ప్రజలకోసం తెరవబడింది. ఈ వారం సమాచారం సమీక్షలో హోస్ట్ అయిషా మిన్హాజ్ క్యూరేటర్ యన్. క్షితిజ, వెటరినేరియన్ ఎం.ఏ హకీం, సీనియర్ జూ కీపర్ పాపయ్య గార్లతో మాట్లాడారు. కోవిడ్-19 నష్టాలు, ఈ కష్ట సమయంలో జంతువులను పెంచుకోవడం పట్ల చిన్నపిల్లలు చూపిస్తున్న ఆసక్తి, జంతువుల ఆరోగ్యం,‌ ప్రవర్తనల్లో మార్పుల వంటి అంశాలతోపాటు రోజువారీ జూ నిర్వహణలో ఎదురయ్యే ఆసక్తికరమైన అనుభవాల గురించి కూడా చర్చించారు. (Nehru Zoological Park of Hyderabad is a well-known landmark and tourist attraction spread over 380acres. Usually buzzing with activity, this was shut for over seven months due to the COVID19 lockdown. The Zoo recently opened for public again. In this week’s Samacharam Sameeksha, host Ayesha Minhaz spoke to curator N Kshitija, veterinarian MA Hakeem, and senior zookeeper R Paapayya. They discuss the COVID19 losses, the interest shown by children to adopt animals during the tough time, behavioural changes, and the health of the animals. Also discussed on the episode are the amusing details of the daily zoo keeping activities.) See sunoindia.in/privacy-policy for privacy information.
తెలంగాణ ప్రభుత్వం, గత రెండుళ్లుగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఖాళీగా ఉంచింది. గత రెండు సంవత్సరాలుగా, రాష్ట్రంలోని మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు, న్యాయవాదులు…. ఇలా అనేక మంది, తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయం గురించి తరచుగా అభ్యర్థిస్తూ వచ్చారు. రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించాలని జాతీయ మహిళా కమిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ, ప్రభుత్వం వైపు నుండి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదు.. అసలు రాష్ట్ర మహిళా కమిషన్ విధులేంటి, కమిషన్ చైర్‌పర్సన్‌ను నియమించకపోవడం వల్ల రాష్ట్ర మహిళలు కోల్పోతున్నదేమిటి, మహిళా కమిషన్ పనితీరులో లోటుపాట్లు…ఈ విషయాలన్నీ ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో చర్చ విషయాలు.ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ కోసం, అయిషా మిన్హాజ్ లాయర్ వసుధ నాగరాజ్ గారితో మాట్లాడారు. (For over two years now, the State Women’s Commission of Telangana hasn’t had a chairperson. For over two years, the women of Telangana haven’t been able to benefit from a fully functioning women’s commission. Activists, women’s organisations, lawyers and the media have been voicing concerns and submitting representations to the government of Telangana, but in vain. This week’s Samacharam Sameeksha episode discusses the role and responsibilities of women’s commission, what a fully functioning commission can achieve, what the women of Telangana are losing out on and why we seem to have forgotten about the existence of this statutory body. Suno India contributor Ayesha Minhaz spoke to lawyer Vasudha Nagaraj for this episode. In October, the High Court of Telangana appointed Vasudha Nagaraj as amicus curiae in the PIL related to this.) See sunoindia.in/privacy-policy for privacy information.
అక్టోబర్ నెలలో హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన వర్షం, వరదల కారణంగా ఎన్నో కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు రావడం, ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కున్న సామాన్లు, వాహనాలు నాశనం అవ్వడం జరిగింది. దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో ఇంతటి వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఈ వరదలకు వర్షం మాత్రమే కారణం కాదు. ఈ సందర్భంగా నగరంలో అవసరమైన మేరకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు లేకపోవడం, చెరువులలో ఆక్రమణల వంటి సమస్యల‌ గురించిన చర్చ మరోసారి ప్రారంభమైంది. ఈ అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్లో అయిషా మిన్హాజ్, ICLEI డిప్యూటీ డైరెక్టర్ సౌమ్య చతుర్వేదుల  గారితో మాట్లాడారు. (Heavy rains and floods lashed Hyderabad’s city in October, flooding homes in many colonies and destroying hard-earned goods and vehicles. The city of Hyderabad received heavy rains almost 100 years later, the Met office said. But rain is not the only cause of these floods.To discuss issues such as the lack of storm water drains in the city and encroachments of the ponds, Ayesha Minhaz spoke to ICLEI Deputy Director Soumya Chaturvedi during this week’s Samacharam Sameeksha episode.) See sunoindia.in/privacy-policy for privacy information.
ఉద్యోగాలు నుంచి తొలగించబడి పొట్టకూటికి ఎన్నో కష్టాలు పడుతున్న లక్షల్లో టీచర్లు. పని చేస్తున్న కొద్దిమంది మీద పెరుగుతున్న పని భారం, తరుగుతున్న జీతాలు, ఇవేవీ పట్టించుకోని ఇరు తెలుగు రాష్ట్ర ప్రభిత్వాలు. ఇక టీచర్ల కష్టాలు తీరేదెప్పుడు. (Lakhs of teachers lost their jobs and those who continue to work huge face pay cuts, plus burden of additional work. Governments of the two Telugu States are hardly bothered about the continued suffering of the teachers who struggle to feed their families. Will there be an end to their troubles?) See sunoindia.in/privacy-policy for privacy information.
(ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం 1914 లో గ్రంథాలయ ఉద్యమం సందర్భంగా స్థాపించబడింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో, స్వతంత్ర ఉద్యమంతో పాతే  'గ్రంథాలయ ఉద్యమం' ఒక ముఖ్యమైన సామాజిక ఉద్యమం గా మారింది. ప్రజలను చైతన్య పరిచే ఉద్ధేశంతో పలు ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. కానీ ఈరోజు పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లలో మొత్తమ్మీద 1600 గ్రంథాలయాలు మాత్రమే ఉన్నాయి. ఉన్నవి కూదా దయనీయమైన పరిస్తితిలో ఉన్నాయి. అంతేకాక 2014 లో విభజన తరువాత, ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం లేదు.  ఈ నేపథ్యంలో, సాయి ప్రియా కొడిదల, ఆంధ్రప్రదేశ్ఘ్ గ్రంథాలయ సంఘ కార్యదర్షకులు, డాక్టర్ రావి శారద గారితో మాట్లాడారు. ) (The Andhra Pradesh Library Association was established in 1914 during the Library Movement. At the turn of the 20th century, Telugu people took to a literary movement—The Library Movement, to support the larger Indian Freedom Struggle. They set up libraries with a strong belief that only empowered individuals can benefit the freedom movement. Soon, they formed the Andhra Pradesh Library Association to spread to different parts of the Telugu regions aiding various people’s movements.. However, the situation is different today. Between Andhra Pradesh and Telangana, there are only 1600 libraries. Those which exist are in dire need of attention in Andhra Pradesh and Telangana. Further, post the bifurcation in 2014, Andhra Pradesh does not yet have a State Central Library.   In this backdrop, Sai Priya Kodidala speaks to Dr. Raavi Sarada, Secretary of the century-old Andhra Pradesh Library Association to understand the Library movement and why it is relevant for us to remember today. Sai Priya Kodidala also runs The Telugu Archive tracing Telugu literature, art and history. ) See sunoindia.in/privacy-policy for privacy information.
ఇటీవల, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు కలిసి ప్రజా సమస్యలు చర్చించడం కోసం ప్రజా అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నెలకొన్న స్తబ్ధత, తాత్కాలిక మరియు దీర్ఘకాలిక సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సుదీర్ఘంగా మూడు రోజులు పాటు చర్చించి, నాలుగో రోజు ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యి, వారికి తీర్మానాలు అందించారు. ప్రజల కోసం ప్రజా సంఘాలు నిర్వహించిన ఈ అసెంబ్లీ వివరాలు ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వారం ఎపిసోడ్‌లో, హోస్ట్ అయిషా మిన్హాజ్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ రవి కన్నెగంటి గారితో ఈ విషయాల గురించి చర్చించారు. ఈ ఎపిసోడ్‌లో, తెలంగాణ హిజ్రా ఇంటర్సెక్స్ ట్రాన్స్ జెండర్ సమితి వ్యవస్థాపక సభ్యురాలు రచన ముద్రబోయిన, తెలంగాణ గృహ కార్మికుల సంఘం (టిడిడబ్ల్యుయు) సయోలా రేణుక ప్రజా అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు కూడా ఉన్నాయి. (Ahead of the Telangana assembly sessions, recently, a Praja Assembly was held to discuss public issues. Civil society organisations, social activists, intellectuals and lawyers in the state came together to organise three full-day sessions with experts from each sector. The stagnant growth, long-standing problems, temporary problems, actions to be taken in various sectors in the state were discussed at length and on the fourth day a meeting was held with the public representatives and resolutions were presented to them. This week’s Samaacharam Sameeksha episode looks at the details of these sessions. For this episode, Ayesha Minhaz discussed these issues with the convener of Raithu Swarajya Vedika Ravi Kanneganti. The episode also carries parts of the Praja Assembly sessions: founding member of Telangana Hijra Intersex Transgender Samiti Rachana Mudraboyina, Telangana Domestic Workers' Union (TDWU) Sayola Renuka, and testimony of a family member of a farmer who died by suicide. ) See sunoindia.in/privacy-policy for privacy information.
స్త్రీవాద దృక్పథాలను ముందుకు తెచ్చేందుకు 1990లలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో భూమిక పత్రిక ప్రారంభించారు. పత్రిక పెద్దదిగా పెరిగి చివరికి 'భూమిక ఉమెన్స్ కలెక్టివ్‌'గా మారింది. నేడు, అనేక ఇతర విషయాలతోపాటు, వారు గృహ హింస బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ నడుపుతున్నారు. నేటి ఎపిసోడ్ గృహ హింస బాధితుల కోసం భూమిక చేసే పని, మహిళలకు ఇస్తున్న మద్దతు, భూమిక సమిష్టిగా చేస్తున్న పోరాటం గురించి. ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ కోసం సునో ఇండియా ఎడిటర్ పద్మ ప్రియ కొండవీటి సత్యవతి గారితో మాట్లాడారు. అయిషా మిన్హాజ్ ఎపిసోడ్ హోస్ట్ చేశారు. (Bhumika was started as a magazine in the 1990s in erstwhile Andhra Pradesh to put forth feminist perspectives. The magazine grew bigger and eventually became Bhumika Women's Collective. Today, among several other things, they also run a helpline for women in distress. Today's episode is about the work Bhumika does in helping survivors of domestic violence, how the women are supported, the fight that Bhumika collective has been putting up. For this week's Samacharam Sameeksha episode, Suno India editor Padma Priya spoke to Kondaveeti Satyavati of Bhumika collective. Ayesha Minhaz hosted the show. ) See sunoindia.in/privacy-policy for privacy information.
పాలగుట్టపల్లె, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పాకాల మండలం లో దళిత వాడ. పాలగుట్టపల్లెలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. కొన్నేళ్ల క్రితం కరువు రావడం, వ్యవసాయ పనులు మందగించడంతో, గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కలిసి పాలగుట్టపల్లె బాగ్స్ స్థాపించారు. ఈ వారం సమాచారం సమీక్ష లో వారి కథ తెలుసుకుందాం: పని ఎలా ప్రారంభించారు, తొమ్మిది మంది బృందానికి ఎలా ఎదిగారు, ఇంకా మారుమూల ప్రాంతం నుండి వ్యాపారం నడపడం లో ఉన్న కష్టాలు. ఈ కథను పాలగుట్టపల్లె మహిళలు అయిషా మిన్హాజ్ కి వివరించారు. (Paalaguttapalle is a Dalit hamlet in Chittoor District of Andhra Pradesh. Most people in Paalaguttapalle are agricultural labourers. As drought struck a few years ago and agricultural work slowed down, a few women of the village got together to make cloth bags. How they grew to a team of nine today, how they operate, the journey of their bags from Paalaguttapalle to places across India and even the UK, is the story Ayesha Minhaz speaks about today. The story is narrated by the women of Paalaguttapalle themselves. Here’s where you can buy the masks, bags, and pickles made by them and find more information about them: http://paalaguttapalle.com/.) See sunoindia.in/privacy-policy for privacy information.
గత ఆరు నెలలుగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన ఉపాధికి డిమాండ్ పెరిగింది. COVID19 లాక్ డౌన్ తర్వాత, ఈ ఉపాధి కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్యతో పాటు పని దినాలు కూడా గతంతో పోల్చుకుంటే పెరిగాయి. కాగా, నిధుల కొరత వల్ల రాబోయే రోజుల్లో ఈ పథకం అమలు కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా సరైన సమాధానం అందడం లేదు. ఈవారం సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్, దళిత బహుజన ఫ్రంట్ కార్యకర్త పి. శంకర్, ఇంకా Libtech India పరిశోధకులు చక్రధర్ బుద్ధతో ఈ విషయం గురించి చర్చించారు. (Over the past six months, NREGA has become a support to not just the regular job seekers, but those who returned to the villages post COVID-19 and lockdown. With increased demand, most states have nearly exhausted the funds for this financial year. This includes Andhra Pradesh and Telangana. However, there haven't been many efforts to tackle this from the state or central governments. In this episode of Samacharam Sameeksha, Ayesha Minhaz spoke to activist P Shankar of Dalit Bahujan Front and researcher Chakradhar Buddha of Libtech India to understand the issues with NREGA in the two Telugu states.)   See sunoindia.in/privacy-policy for privacy information.
COVID19 లాక్డౌన్ అమలు చేసినప్పటి నుండి, రైతులు, ముఖ్యంగా మహిళా ఇంకా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రైతుల హక్కుల కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో కొన్నిటికి పరిష్కారం దొరకలేదు. ఖరీఫ్ ప్రారంభంలో రైతులకు సంబంధించిన ఇంకో అంశం చర్చనీయంశంగా మారింది - తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానం. మహిళా, కౌలు రైతుల ఇబ్బందులు, ఇంకా నియంత్రిత సాగు గురించే ఈ వారం చర్చ. ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో, మహిళా రైతుల హక్కుల కార్యకర్త ఎస్ ఆశాలత గారితో, ఇంకా మహిళా, కౌలు రైతుల హక్కులు, భూ సమస్యల పరిశోధకురాలు ఉషా సీతాలక్ష్మి గారితో షో హోస్ట్ అయేషా మిన్హాజ్ మాట్లాడారు. ఆశాలత గారు, ఇంకా ఉషా సీతాలక్ష్మి గారు మహిళా రైతుల హక్కుల వేదిక తో కలిసి పని చేస్తారు. (Since the implementation of COVID19 lockdown, farmers' rights activists have been flagging issues being faced by farmers, especially women and tenant farmers during this period. This, in addition to the longstanding prevailing problems. This week's Samacharam Sameeksha discusses this with this along with another farmers’ rights concern that garnered a lot of attention in Telangana in recent times. Ahead of Kharif season, Telangana government’s decision to impose regulated cropping became contentious as flouting it would mean giving up Raithu Bandhu input subsidy, and minimum support price. In this episode, Samacharam Sameeksha host Ayesha Minhaz spoke with women farmers' rights activist S Ashalatha and activist and academic Usha Seethalakshmi about these two themes: impact of COVID19 on women, tenant farmers and regulated cropping. Both Ashalatha and UshaSeethalakshmi are associated with Mahila Raithula Hakkula Vedika (a forum known as MAKAAM at the national level)). See sunoindia.in/privacy-policy for privacy information.
సురభి నాటక సమాజం  తెలుగు నాటక రంగంలో అత్యంత ప్రముఖమైనది. నాటకమే జీవితం గా భావించి అంకితభావం తో తరతరాలుగా నటిస్తున్నారు. నాటకాన్ని సజీవం గా ఉంచుతున్నారు. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ప్రపంచం లోనే  కుటుంబ నిర్వహణలో సభ్యులతో ఉన్న ఒకే ఒక నాటక సమాజం గా చెబుతారు. ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడి న సురభి సంస్థ ప్రస్తుత కోవిడ్ విలయ తాండవం లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈవిధమైన సహాయం సాటి మనుషులుగా మన నుండి ఆశిస్తారో సురభి ఆరవ తరం దర్శకులు శ్రీ జయచంద్ర వర్మ గారు సునో ఇండియా ఫౌండర్ పద్మ ప్రియ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ లో విందాము. (Surabhi Theatre group is one of the most prominent names in Telugu theatre. Actors in Surabhi have been acting in plays for generations with dedication. With a history of over 130 years, it is said to be the only theatre in the world with family members managing it. This theatre group which survived the world wars over ages is now in the brink because of COVID. For this episode, our editor Padma Priya spoke with Mr. Jayachandra who is the sixth-generation director of Sri Venkateswara Surabhi Theatre group.) See sunoindia.in/privacy-policy for privacy information.
తెలంగాణ ప్రభుత్వ స్వీయ ప్రకటన ప్రకారం, వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 143 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు కోవిడ్‌కు పాజిటివ్ గా తేలింది వారిలో సగం మందికి గత రెండు వారాలలో మాత్రమే వ్యాధి సోకింది. ఈ సంఘటనలు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అందుబాటులో ఉంచబడుతున్న భద్రతా సామగ్రి లభ్యత మరియు నాణ్యత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. పిజి విద్యార్థులకు కవిడ్ పరీక్షలను నిరాకరించిన ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిపాలనపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, రోగి చనిపోయినట్లు ప్రకటించిన తరువాత రోగి బంధువులు తమ సహోద్యోగిని కొట్టడంతో గాంధీలో పనిచేసే వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యులు మరియు ఇతరులు వైద్యులకు భద్రత లేకపోవడం, ఎక్కువ పని గంటలు, ఇతర సమస్యలలో మంచి నాణ్యమైన PPE lu  లేకపోవడం పై నిరసన వ్యక్తం చేశారు. పిజి పరీక్షలు కూడా ఆలస్యం కావాలని వారు కోరారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూనియర్ వైద్యులు కేసుల వికేంద్రీకరణ కోసం, వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి ఇ టల రాజేందర్, వారి డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో, జూనియర్ వైద్యులు తమ సమస్యలను పరిష్కరించడానికి 15 రోజుల సమయం ఇచ్చారు. సమాచారం సమీక్ష యొక్క ఈ ఎపిసోడ్ కోసం, సునో ఇండియా ఎడిటర్ పద్మ ప్రియా వారి సవాళ్లను అర్థం చేసుకోవడానికి టిజుడా (తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణు మరియు టిజెయుడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మి ప్రియాతో మాట్లాడారు. See sunoindia.in/privacy-policy for privacy information.
రాబోయే నెలల్లో, మన దేశంలో COVID-19 కేసులు పెరుగుతాయని ఒక అంచనా ఉంది. దానికి అనుగుణంగా, ఆరోగ్య సేతు వాడకం కూడా పెరగవచ్చు. ఇప్పటికే అనేక సంస్థలు తమ కార్యాలయాలు, మాల్స్, షాపులు మొదలైన వాటిలో ప్రవేశించడానికి ఆరోగ్య సేతును తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ యాప్ ఉపయోగం ఏంటి, దీని అవసరం, లోటుపాట్లు, ప్రైవసీ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇవాళ్టి 'సమాచారం సమీక్ష' ఎపిసోడ్ కోసం శ్రీనివాస్ కొడాలి మరోసారి ‘సమాచారం సమీక్ష’ చర్చకి వచ్చారు. (In the coming months, there is an expectation that COVID-19 cases will increase in our country. Accordingly, the use of health care can also increase. Already, many companies are mandating the Health Service to enter their offices, malls and shops. Against this backdrop, let's learn about the use of this app, its need, deficits and privacy. In today's episode of our podcast "Samacharam Sameeksha" Srinivas Kodali has once again come to explain this.) See sunoindia.in/privacy-policy for privacy information.
మార్చి మూడవ వారంలో, భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నందున, తెలుగు చిత్ర పరిశ్రమలో పనులు ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సినిమా థియేటర్లు మూసివేశారు. సినిమా షూటింగులు ఆగిపోయి, దాదాపు రెండు నెలలుగా సినిమా విడుదలలు లేక, పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సంక్షోభం కార్మికులు, కళాకారులు, దర్శకులు, స్టూడియోలు, నిర్మాతలు. ఇలా ఎంతో మందికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇవాళ్టి సమాచారం సమీక్షలో, వీటన్నిటి గురించి చర్చిస్తూ, బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ గారితో అయిషా మిన్హాజ్ ఇంటర్వ్యూ. (In the third week of March, as the number of COVID-19 cases in India increased, work in the Telugu film industry stopped. Movie theatres have been shut down to keep the virus from spreading. After nearly two months of no film releases, the industry is facing a financial crisis. The crisis has caused a serious financial loss for the workers, artists, directors, studios, producers and so on. In this episode of Samacharam Sameksha, Ayesha Minhaz interviews Baahubali producer Shobhu Yarlagadda, to discuss these and more.) See sunoindia.in/privacy-policy for privacy information.
నేటి సమాచారం సమీక్షలో, అయిషా మిన్హాజ్ COVID19 విధుల్లో ఉన్న ఆశా వర్కర్లు  ఎదుర్కొంటున్న సమస్యల గురించి రిపోర్ట్ చేశారు. ఆశాలు సర్వేకి వెళ్ళేటప్పుడు మాస్క్‌లు, గ్లవ్స్ లేకపోవడం, ప్రజలు సహకరించకపోవడం, రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ప్రస్తుత సమస్యలతో పాటు  జీతాలు ఆలస్యంగా అందటం, శాశ్వత ఉద్యోగాలు లేకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యల గురించి కూడా చర్చించారు. ఫీల్డ్ రిపోర్టింగ్: ఆయిషా మిన్హాజ్, సునో ఇండియా ఎడిటర్ పద్మప్రియ (In Today’s Samacharam Sameeksha, Ayesha Minhaz and Suno India editor Padma Priya report on the difficulties faced by ASHA workers while on COVID19 frontline duty. ASHA workers were roped in to do door-to-door surveys with hardly any protective gear in several places. Further, with public transport services shut, they have been facing difficulty travelling too. We spoke to union leaders and ASHA workers on the issues they are facing currently, and the longstanding issues such as delays in salaries, lacking permanent jobs etc.) See sunoindia.in/privacy-policy for privacy information.
loading
Comments 
Download from Google Play
Download from App Store