ఎలుకల బెడద ఎక్కువైన వి ఇంట్లో వాటిని బయటకి తోలడానికి నేను చేసిన పని వాటికి మాట్ పెట్టడం .అది పెట్టడం వల్ల ఎలుకలు అందులోకి వెళ్ళగానే అతుక్కుని కదలనివ్వదు .అలా రెండు పడ్డాయి . ఇక పొద్దున నేను చేసిన కూర గురించి , బీరకాయ కర్రీ .చిన్న కుటుంబం కాబట్టి రెండు బీరకాయలు సుమారు అర కేజీ ,రెండు ఉల్లిపాయలు,నాలుగు మిరపకాయలు , కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు,పసుపు,నూనె,అల్లం వెల్లుల్లి ముద్ద,ఇంకేం అన్ని వేసి మగ్గబెడ్తే ఇక మన బీరకాయ కూర రెడి .ఇందులో నేను నీరు కలపలేదు కావాలనుకుంటే కలుపుకోవచ్చు..
మొక్కై వంగనిది మ్రానై వంగునా అనే భావజాల సమేత ఆధారంగా మీకోసం తీసుకువస్తున్న చిన్న సందేశం నా స్టైల్ ఆఫ్ వ్యూ లో ..మన అందరి పిల్లల విషయం లో మనం చేసే శిక్షణ ఆధారంగానే పెరిగి పెద్దవుతారు .వారికి సరైన దిశ నిర్దేశం చేసిన వారిగా మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్చి దిద్దవల్సిన బాధ్యత పెద్దలుగా మన మీద ఉన్నది .దాని ఆధారంగా మీ ముందుకు తీసుకు వస్తున్న ఈ కథనం విని ఆదరిస్తారని కోరుకుంటున్న .మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాకు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు.