Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

మనుషులు మారాలి ఎపిసోడ్ - 10 | Manushulu Marali Episode 10 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఈ వయస్సులో చాలామంది ఆనందంగా తమ పిల్లలతో గడుపుతారు. మాకు ఆ అదృష్టం లేదు సరోజిని గారూ. ఒక్కడే కొడుకు మాకు. కోడలు వస్తుంది కదా, ప్రేమగా అభిమానంగా ఒక కూతురిలా చూసుకోవాలని ఉవ్విళ్లూరాను. నేను ఎంత ఆరాటపడినా ఆ అమ్మాయి మాకు దగ్గరవలేదు.  యాత్ర ముగిసిన తరువాత తిరిగి ఇంటికి రావాలని లేదు. కాశీలోనే ఉండిపోయి ఆ కాశీవిశ్వనాధుని సేవ చేసుకుంటూ ఆయన సన్నిధిలోనే తమ తనువులు చాలించాలని ఉందంటూ చెప్పేసరికి సరోజిని కళ్లు అశ్రుపూరితలైనాయి.  పోనీ వృధ్దాశ్రమానికి వెళ్లిపోతామురా అబ్బాయి అంటుంటే మా అబ్బాయి బాధపడుతున్నాడు. వాడి ముఖం చూసే మేము ఎక్కడకీ కదలలేక పోతున్నాం.  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/9w2cndbIJJA

12-19
10:19

మనుషులు మారాలి ఎపిసోడ్ - 9 | Manushulu Marali Episode 9 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 9'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 15/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుప్రజ సరళ కు మంచి పట్టుచీర, రాఘవ్ కు పేంట్, షర్టూ, అలాగే పిల్లలకు, రాఘవ్ తల్లికి చీర కొని తెచ్చింది. సరళకు బొట్టు పెట్టి తాంబూలం పట్టు చీర చేతిలో పెట్టి సరళకూ రాఘవ్ కూ నమస్కరించింది. సుప్రజను ఆప్యాయంగా కౌగలించుకుంది సరళ.  “సుప్రజా, నిన్ను చూసి చాలా నేర్చుకున్నాను. నాలో మార్పుకి పరోక్షంగా నీవే కారణం. ఉద్యోగస్తురాలివైనా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో ఓర్పుగా సంసారం చక్కదిద్దుకునే తీరు నన్ను ముగ్ధురాలిని చేసింది. నిన్ను ఎన్నో మాటలు అనేదాన్ని. ఏనాడూ నన్ను పల్లెత్తు మాట అనేదానివి కాదు. భర్తను వదిలేసి పిల్లలతో పుట్టింట్లో ఉన్నా ఎంతో గౌరవంగా చూసుకున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు సుప్రజా.. నా కంటే చిన్నదానివైనా సంస్కారంలో నేను అందుకోలేనంత ఎత్తులో ఉన్నావు. నీవూ, మోహన్ హాయిగా సంతోషంగా ఉండాలి ఎప్పటికీ”.  “వదినా! కుటుంబాలలో సమస్యలు రావడం సహజం. మనిషి అన్న తరవాత రాగద్వేషాలు ఉండకుండా ఉండవు. మీలో ఒక మంచి మార్పు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఎవరివలన వచ్చిందోనని కాదు. నన్ను మీరు అంతలా ఎత్తేయనవసరం లేదు. నేనూ సాధారణమైన స్త్రీనే.  మీరు ఇలా హాయిగా ఆనందంగా మా రాఘవ్ అన్నయ్యతో కలసి కాపురం చేసుకోవడం కంటే కావలసిఉంది ఏముంది?”  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8sf-9v26OB4

12-15
09:39

మనుషులు మారాలి ఎపిసోడ్ - 8 | Manushulu Marali Episode 8 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 8'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 11/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక  (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ రోజు సుప్రజ ఆఫీస్ లో పని ఎక్కువ ఉన్న మూలాన సాయంత్రం ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది. సుప్రజ ను చూడగానే అత్తగారు “వచ్చావా సుప్రజా, తల పగిలిపోతోందమ్మా, కాస్త కాఫీ పెట్టి ఇస్తావా” అనే సరికి తెల్లబోయి చూసింది. మరో మాట మాట్లాడకుండా అత్తగారికి వేడి వేడి కాఫీ తో బాటు రెండు బిస్కట్లు కూడా ఇచ్చింది. అసలు కే సుగర్ పేషెంట్, నీరసంగా ఉన్న మూలాన గబ గబా బిస్కట్లు తిని కాఫీ తాగింది.  “ఆ రాక్షసి..” అంటూ అటూ ఇటూ చూస్తూ, “కాస్త కాఫీ పెట్టివ్వవే సరళా అంటే ‘ఇవాళ కాఫీ అంటావు, రేపు వంట చేయమంటావు. ఇంక నీ కోడలు మొత్తం పని నామీద అంటగట్టేసి టింగురంగ మంటూ ఆఫీసుకి వెళ్లిపోతుంది. వచ్చాక తన చేతే పెట్టించుకో’మంటూ పక్క వాళ్లింటికి పెత్తనానికి వెళ్లిపోయింది. చిన్న పిల్లవు, ఇంటి పనంతా చేసుకుంటూ అన్నీరెడీ చేసి ఆఫీసుకు వెళ్లి వస్తున్నావు. నిన్ను చూసైనా దానికి బుధ్దివస్తుందేమో అనుకుంటే ఆ ఆశ కూడా పోతోంది. భర్తతో హాయిగా సంసారం చేసుకోకుండా ఇదేమైనా బాగుందా సుప్రజా? నేను ఏదైనా గట్టిగా కోప్పడితే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయం ఒకటి”.  “పోనీలెండి అత్తయ్యా, మీరేమీ అనద్దు. ఏదో ఒకనాటికి సరళ వదినలో మార్పు వస్తుంది లెండి. మీరు దిగులు పడితే బి. పి, సుగర్ ఎక్కువ అవుతుంది. అసలుకే గుండె వీక్ గా ఉందని సంతోషంగా ఉండమని డాక్టర్ చెప్పలేదా? వంట చేసేస్తాను, లేట్ అయిం”దంటూ చీర మార్చుకోడానికి తన గదిలోకి వెళ్లిపోయింది సుప్రజ.  Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ItLc_EInCLM

12-11
09:08

మనుషులు మారాలి ఎపిసోడ్ - 7 | Manushulu Marali Episode 7 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 7' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 05/12/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఇవి రహస్యంగా విన్న మాటలు కావురా. నీ మాటలు నాకూ మీ అమ్మకూ కూడా వినపడ్డాయి. కొనుక్కోండి, ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ శైలూ కి ఒక ఏభై వేల రూపాయలు సర్దుబాటు చేయమంటే లేవన్నావు చూడు, ఆ మాటకి బాధ వేసింది. అదేమీ ఉరికే అడగలేదు నిన్ను. నీకు వెంటనే పంపిస్తానని మరీ మరీ నీకు చెప్పమంది. నీవు సంవత్సరం క్రితం ఫ్లాట్ కొనుక్కుంటున్నానని దానితో చెప్పినపుడు అది నీవు అడక్కుండానే రెండు లక్షలు పంపిందన్న విషయాన్ని మరిచిపోయావా?” “నేను శైలూ కి ఆ డబ్బు తరువాత ఇచ్చేయలేదా? నాకేమైనా బహుమతిగా ఇచ్చిందా ఏమిటి?” “ఓరి ఇడియట్, ఆడపిల్ల నుండి నీవు ఆశించావేమోగానీ అది ఎప్పుడూ నీ నుండి ఏమీ ఆశించలేదు. పైపెచ్చు అది దుబాయ్ నుండి వస్తూ నీకూ నీ భార్యకూ ఎన్నో విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు బాగా అర్ధమైందిరా నీ కుత్సితపు బుధ్ది. నీ లాంటి కొడుకుని కన్నందుకు నేనూ మీ అమ్మా సిగ్గుపడాలి. నీవు మా మీద ప్రేమతో నీ దగ్గరకు పిలిపించుకుంటున్నావని అనుకున్నామే కానీ మీ అమ్మ ఒక ఆయాగా, నేనొక నౌకర్ గా పనికి వస్తామవ్న దురాశతో తీసుకెడుతున్నావని అనుకోలేదు. నిజంగా కన్న తల్లితండ్రులమన్న ప్రేమ ఉంటే నీవు ఆదరణగా మమ్మలని చూసి ఉంటే నీ ఇంట్లో మేము చాకిరీ చేస్తున్నామనే భావన వచ్చి ఉండేది కాదు. శేఖర్ పిల్లలనూ పెంచాం. కానీ మీ అన్నయ్య గానీ వదిన గానీ ఏనాడూ మమ్మలని నిర్లక్యం చేయలేదు. ఎంతో గౌరవంగా చూసుకున్నారు”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Oy4epDU6qos

12-05
09:42

మనుషులు మారాలి ఎపిసోడ్ - 6 | Manushulu Marali Episode 6 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 25/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ప్రసూనాంబ, ప్రసాదరావులకు రెండో కొడుకు రమేశ్ ఇంటికి వచ్చిన కొన్ని రోజుల వరకు ఆనందంగానే గడిచిపోయింది. ప్రీతి, రమేశ్ వాళ్ళిద్దరినీ నెత్తిమీద పెట్టుకుని మరీ చూసారు. ప్రతీనెల అమ్మా నాన్నగారి మందులకు, ఖర్చులకు పదిహేను వేలు పంపమని రమేశ్ అడిగితే శేఖర్ సరే పంపుతానన్నాడు. ప్రీతి పొద్దుటే లేచి ఆఫీస్ కు వెళ్లిపోతోంది. పిల్లవాడిని చూసుకోవడం, ఇంట్లో వంటపని, మొత్తం పని అంతా ప్రసూనాంబ మీద పడింది. ఆవిడకు పెద్ద కోడలు తమింటికి వచ్చినప్పటి నుండి పని అంతా మాధవే చేస్తున్న మూలాన బొత్తిగా పని అలవాటు పోయింది. ప్రొద్దుట లేవగానే చేతికి వేడి వేడి కాఫీ అందించేది మాధవి. చక చకా టిఫిన్ తయారు చేసి డైనింగ్ టేబిల్ పెట్టేసేది. తరువాత స్నానం చేసి వంట పూర్తిచేసి పిల్లలను తయారు చేసేది స్కూళ్లకి. తాను టిఫిన్ తిని లంచ్ బాక్స్ సర్దుకుని అత్తగారిని మామగారిని కూడా సమయానికి టిఫిన్, భోజనం చేయమని ఒకటికి రెండుసార్లు చెప్పి ఆఫీస్ కు బయలు దేరేది. ఇక్కడ అలా కాదు, ప్రీతి ఆలస్యంగా లేవడమే కాదు, ఒక రోజు అత్తగారితో చెప్పేసింది కూడా. నేను ప్రొద్దుటే లేవలేను. బాబు రాత్రిళ్లు అస్తమానూ లేస్తాడు కాబట్టి. టిఫిన్, వంట మీరే చూసుకోండంటూ. ఏనాడూ కాఫీ తాగారా అన్న మాటగానీ, వేళకు భోజనం చేస్తున్నావా అని అడిగే దిక్కులేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

11-26
09:09

మనుషులు మారాలి ఎపిసోడ్ - 5 | Manushulu Marali Episode 5 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 5' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “మరి నీవే మాధవీ”? “ఏముందే సుప్రజా చెప్పడానికి. నాలుగు రోజుల క్రితమే మా మరిది ఫోన్ చేసాడుట మా వారికి. ‘వాళ్ల జీతాల్లో సగం భాగం అంతా ఇంటి లోన్ కే పోతోంది. అమ్మా నాన్న మందులకి ఖర్చులకు ప్రతీ నెల డబ్బు పంపించు అన్నయ్యా’ అంటూ. ఈ సారి ఒక పదివేలు ట్రాన్స్ ఫర్ చేయమన్నాడు. తల్లీ తండ్రినీ తను చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్లను తన దగ్గరే ఉంచుకుంటానని తీసుకు వెళ్లడం ఎందుకో నాకూ మా వారికి అర్ధం కాలేదు. మా అత్తగారూ మామగారూ మా దగ్గర ఉన్నప్పుడు వారిరువురి బాధ్యత మాదే అనుకుంటూ ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నాం. మా మరిది ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు తల్లీ తండ్రిని చూడడానికి. ఏనాడూ కనీసం పండ్లు కూడా తెచ్చేవాడు కాదు. ఒక్క వంద రూపాయలు కూడా ఉంచుకోండంటూ చేతిలో పెట్టేవాడు కాదు. ఇప్పుడు వాళ్ల పోషణకు మా నుండి డబ్బు అడగడం ఏమంత బాగుందే? భార్యా భర్తలిరువురూ బాగానే సంపాదించుకుంటున్నారు. కన్న తల్లీ తండ్రిని ఆ మాత్రం చూసుకోలేని దుస్థితి కాదు. మేమేదో లక్షలు సంపాందించుకుంటూ వెనకేసుకుంటున్నామన్న దుగ్ధ కూడా మా మరిది మాటల్లో ప్రస్ఫుటమౌతుంది. ఇంటికి పెద్దవాడిని, ఇవ్వలేనంటే ఏం బాగుంటుందంటారు మా వారు. ముందు మా మరిదికి పంపించాకా తరువాత మిగిలిన డబ్బుతో పిల్లలకు బట్టలు కొనాలని అనుకుంటున్నాం”. “మన మధ్య తరగతి జీవితాలు అంతేనే మాధవీ. ఒకరి కష్టాలు మరొకరం పంచుకోడానికే భగవంతుడు మన ముగ్గురినీ కలిపాడనుకుంటూ ఉంటాను ఎప్పుడూ. మీకు ఏ విషయంలో సహాయం కావలసి వచ్చినా నేను ఉన్నానే”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GKoClDyaA6A

11-19
09:20

మనుషులు మారాలి ఎపిసోడ్ - 4 | Manushulu Marali Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 4' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 13/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మాధవి మరిది రమేశ్ చాలా తెలివైనవాడు, లౌక్యం బాగా తెలుసున్నవాడు. “అన్నయ్య ఇంట్లో ఎన్నాళ్లు చాకిరీ చేస్తూ కూర్చుంటావమ్మా, ప్రీతి కూడా మరీ మరీ చెప్పి పంపించింది, అత్తయ్యగారిని మామయ్యగారిని మన దగ్గర పెట్టుకుందాం, వాళ్లకు ఏ కష్టమూ రాకుండా చూసుకుందామని చెపితే వచ్చాను. మీ బట్టలూ అవీ సర్దుకోండి. అన్నయ్యకూ వదినకూ నేను నచ్చ చెపుతా”నని వాళ్లతో చెప్పి అన్నగారితో మాట్లాడదామని హాల్ లోకి వచ్చాడు. “ఏరా రమేశ్, ప్రీతి, బాబు ఎలా ఉన్నా”రంటూ శేఖర్ తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు. “బాగానే ఉన్నారన్నయ్యా. అమ్మా నాన్నగారిని నా దగ్గరకు తీసుకువెడదామని వచ్చాను. వాళ్లకి ఎన్నాళ్లు నా దగ్గర ఉండాలనిపిస్తే అన్నాళ్లూ ఉంటారు. పాపం ఇంతకాలం నీవు వదినా వాళ్లను బాధ్యతగా చూస్తూ వచ్చారు. నాకు కూడా వాళ్లను దగ్గర పెట్టుకుని చూసుకోవాలనిపిస్తుంది కదా”. “అదేమిటి రమేశ్? ఎందుకనిపించదు? అసలు నీవు ప్రీతీ, బాబూ మనం అందరం ఒకే చోట కలసి ఉందామని నీతో ఎన్నో సార్లు చెప్పాను. ప్రీతి ఆఫీస్ కు ఇక్కడ నుండి వెళ్లడం కష్టం అవుతుందనేసరికి అదీ నిజమే అనుకున్నాను. అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటేనేమి? నీవు ప్రీతి బాబుతో కలసి ఎప్పుడు చూడాలని పించినా ఇక్కడకు రావచ్చు ఉండచ్చు”. ఈ లోగా ప్రసూనాంబ అక్కడకు వచ్చి శేఖర్ వైపు చూస్తూ “కొన్నాళ్లు వెళ్లి రమేశ్ దహ్గర ఉంటామురా. వాడూ పాపం మా కోసం అల్లాడిపోతున్నాడు. ప్రీతి కూడా పదే పదే చెప్పి పంపించిందిట. మేము కొన్నాళ్లు రమేష్ దగ్గర ఉంటే పాపం మాధవి కి కూడా రెస్ట్ గా ఉంటుంది కదా”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/enGXa_xfxSY

11-13
08:11

మనుషులు మారాలి ఎపిసోడ్ - 3 | Manushulu Marali Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 3' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 07/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆ పరిస్తితిలో ఉన్న ఏ మగాడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోగడు? కన్న తల్లిని ఎక్కడకు పంపేయగలడు? ఉన్న ఒక్క చెల్లెలు భర్తతో సింగ్ పూర్ లో ఉంది. అక్కకు ఆర్ధికపరంగా ఏలోటూ లేదు. బావగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సొంత ఇల్లు. బాధ్యతలు లేవు. డభై అయిదేళ్లు దాటిన అత్తగారితో తగువులు పెట్టుకుంటుంది. భర్త ఏదో ఆలోచిస్తూ మౌనంగా బట్టలు మార్చుకుంటుంటే ఏమిటీ రోజులా లేరు, అదోలా ఉన్నారేంటంటూ సుప్రజ ప్రశ్నించింది. “మా అక్క గురించే సుప్రజా. సాయంత్రం బావగారిని కలిసాను. అక్క పోట్లాట పెట్టుకుని ఇక్కడకు వచ్చేసిందని చాలా బాధపడుతున్నాడు. మీ అమ్మగాని నేను గాని ఎవరో ఒకరే ఉండాలి మీతో. ఆలోచించుకోండంటూ వచ్చేసిందిట. ప్రతీసారీ బ్రతిమాలి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లడంతో నన్ను లెక్క చేయడంలేదు మీ అక్క. ఈసారి ఏదో నిర్ణయం తీసుకున్న తరువాతే మీ అక్కను కలుస్తానన్నాడు బావ”. “అవునండీ పాపం అన్నయ్యగారి తప్పేమీ లేదు”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/HyBMjYhVgQg

11-07
08:32

మనుషులు మారాలి ఎపిసోడ్ - 2 | Manushulu Marali Episode 2 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu' Marali Episode 2' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 01/11/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 2' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆరోజు సాయంత్రం సుప్రజ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆడపడుచు సరళ, ఆమె ఇద్దరు పిల్లలు వచ్చి ఉన్నారు. సరళ ఎందుకో సీరియస్ గా ముఖం గంటు పెట్టుకుని కూర్చుని ఉంది. అత్తగారి ముఖం కూడా సీరియస్ గా ఉంది. సుప్రజ భర్త మోహన్ కృష్ణ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. సుప్రజ మౌనంగా బాత్ రూమ్ లోకి వెళ్లి రిఫ్రెష్ అయి కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్లింది. కాఫీ కప్పులు తీసుకుని అత్తగారి గదిలోకి వెళ్లబోతుంటే అత్తగారి మాటలు ఆమెను గది గుమ్మందగ్గరే నిలబెట్టేసాయి. సంస్కారం కాకపోయినా అత్తగారు సరళను కోపంగా మాట్లనడం సుప్రజ చెవిని పడ్డాయి. “ఏమైనా నీవు తొందరపడకుండా ఉండ వలసిందే సరూ, మీ అత్తగారితో పోట్లాట పెట్టుకుని వచ్చేయడం సబబుగా లేదు. నీదంతా తొందరపాటు స్వభావమే. మీ ఆయనకు నెమ్మదిగా నచ్చ చెప్పు కోవాలేగానీ, ఇలా వచ్చేయడం ఏమంత బాగుందే. నీ తమ్ముడు మోహన్, సుప్రజ ఏమనుకుంటారు? ముఖ్యంగా సుప్రజ దృష్టిలో ఎంత లోకువైపోతావో ఆలోచించావా? అల్లుడికి అసలే పంతం ఎక్కువ. నిన్ను బ్రతిమాలడానికి వస్తాడనుకుంటున్నావా?” సుప్రజకు పరిస్తితి చూచాయగా అర్ధం అయింది. ముందస్తుగా లేని దగ్గును తెచ్చుకుంటూ వేడి వేడి కాఫీ వాళ్లకు అందించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_tWNu16CJy8

11-01
08:46

మనుషులు మారాలి ఎపిసోడ్ - 1 | Manushulu Marali Episode 1 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com

'Manushulu Marali Episode 1' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 20/10/2023 'మనుషులు మారాలి ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అది మధ్యాహ్నం లంచ్ సమయం. ఆఫీస్ లంచ్ రూమ్ లో ఒకే టేబిల్ మీద కూర్చుని కలసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు సుప్రజ, మాధవి, నీరజ. లంచ్ టైమ్ అరగంటలో వాళ్ల మాటలు ఎక్కువగా తమ కుటుంబాలకి సంబంధించినవై ఉంటాయి. ముగ్గురివీ ఆఫీస్ లో వేర్వేరు విభాగాలైనా లంచ్ సమయంలో కలుసుకుంటూ విధిగా ఒకే టేబుల్ పై కూర్చుని భోజనం చేయడం దాదాపు పది సంవత్సరాల నుండి జరుగుతోంది. “ఈ ఆదివారం మా ఆడపడుచు సరళ వస్తానని ఫోన్ చేసిందే” అంటూ సంభాషణ ప్రారంభించిన సుప్రజ వైపు చూసారు మాధవి, నీరజ. “మీ ఆడపడుచు రావడంలో వింతేముందే సుప్రజా. ఒకే ఉర్లో ఉంటున్న మూలాన మీ ఆడపడుచు ప్రతీ ఆదివారం వచ్చి మీ అత్తగారి యోగక్షేమాలను శ్రధ్దగా విచారించి నీ నెత్తిమీద నాలుగు అక్షింతలు జల్లి వెళ్లడం పరిపాటేకదా. పాపం ఆవిడ ప్రాణాలన్నీ మీ అత్తగారిమీదే పెట్టుకుని జీవిస్తోందాయ్. ఈ సుప్రజ అనే రాక్షసి తన తల్లిని ఎంత హింసపెడ్తోందోనన్న ఆరాటమే కదా ఆమెకు ఎప్పుడూనూ”. “అవునే, వచ్చిన ప్రతీసారీ మా అమ్మ ఇది తినదు, అది తినదు, ఈ చప్పిడ తిళ్లు ఎలా తింటుందంటూ తన అసహనాన్ని వ్యక్త పరుస్తుంది. మా అత్తగారికి బి. పి, సుగర్ ఉందని నేను జాగ్రత్తపడుతూ వంటలు చేస్తూంటే ఇలా ప్రతీదానికి వంకలు పెడ్తూ నేను మా అత్తగారికి తిండి పెట్టకుండా మాడ్చివేస్తున్నానని ఆవిడ ఉద్దేశ్యం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/g0TxwrOqdFs

10-26
08:36

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 10 | Prema Entha Madhuram Episode 10 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 10' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 01/11/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “నాకు తెలుసునండి.... మీ గురించి... మీరు... నాకు సంజాయిషీ చెప్పనవసరం లేదు”. "సుశీల! నేను అంటే ఇష్టమేనా"? "మళ్లీ మొదలెట్టారు!.... శ్రీవారు.. మీరంటే నాకు చాలా... చాలా ఇష్టం.... ఇదంతా చేసింది... మీ దిగులు పోగట్టడానికి... మీ మీద అనుమానము తో కాదు శ్రీవారు... " “పద... ఇంటికి పద…” అందరూ వెళ్ళిపోయారు... కార్ స్టార్ట్ చేసి సతీష్ చల్లటి వెన్నెల లో కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ చల్లటి గాలిలో... పక్కన తనని ఎంతగానో ప్రేమించే సుశీ... తల బుజం మీద వాల్చి నిద్రపోతుంటే, తనకోసం ఇంత చేసిన తన సూసీ ని చుస్తువేంటే.... ఎంతో ఆనందంతో.. తన మనసులో దిగులంతా... మర్చిపోయాడు సతీష్. మర్నాడు... మార్నింగ్ సతీష్ కు ఫోన్ వచ్చింది... "హలో" "హలో! నేను కళ్యాణి" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5HSdBwx61ps

11-01
07:57

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 9 | Prema Entha Madhuram Episode 9 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 9' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 26/10/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుశీల, సతీష్ కార్ లో హోటల్ కు చేరుకున్నారు.. అక్కడ ఏర్పాట్లు చూస్తోంది కమల.. లంచ్ కు అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసారు.. కేక్ కటింగ్ గ్రాండ్ గా ప్లాన్ చేసారు.. సతీష్ హోటల్ లోకి ఎంటర్ అవగానే, చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు.. అప్పుడే ఎంటర్ అయ్యింది రాణి.. "హాయ్ సతీష్!" "ఎవరు?" "రాణి అండి.. మీ పదవ తరగతి ఫ్రెండ్.. " "నేను ఎప్పుడు చూడలేదు.. హాయ్ రాణి.. ఎలా ఉన్నారు?" "సతీష్ ఎలా ఉన్నావ్?" "నేను ఊహించినట్టుగానే ఉన్నావు.. చాలా హ్యాపీ.. " "ఇదేంటి సుశీల.. నా పార్టీ కి రాణి రావడం ఏమిటి?" "ఇంకా చూడండి.. వెయిట్ చెయ్యండి" "సతీష్! చాలా రోజులైంది నిన్ను చూసి.. నేను రాణి.. అప్పట్లో నువ్వు బాయ్స్ లో స్కూల్ ఫస్ట్ కదా.. నేను గర్ల్స్ లో స్కూల్ ఫస్ట్.. నిన్ను ఎప్పుడు కలవలేదు.. మీ ఫ్రెండ్స్ నీ గురించి చెప్పేవారు.. నా గురించి నీకు తెలియదు.. " "రాణి పేరు నాకు తెలుసు.. నువ్వు ఫస్ట్ కదా!.. కానీ నువ్వు అన్నట్టు నేను నిన్ను ఎప్పుడు చూడలేదు.. చాలా థాంక్స్ నా పార్టీ కి వచ్చినందుకు.. " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0FLp7zh-oSU

10-26
10:14

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 8 | Prema Entha Madhuram Episode 8 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 8' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 21/10/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక రచన: తాత మోహనకృష్ణ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఫోన్ పెట్టేసిన తర్వాత.. సుశీల కళ్యాణి గురించి దీర్ఘంగా ఆలోచిస్తుంది.. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది.. "ఎవరబ్బా ఈ టైం లో?" అనుకుంటూనే.. తలుపు తీసింది సుశీల.. "అమ్మా! నువ్వా.. ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు.. " "మా అమ్మాయి దగ్గరకు రావడానికి.. నాకు పర్మిషన్ కావాలా?" "ఉండు కాఫీ తెస్తాను.. ఈలోపు ఫ్రెష్ అయ్యి రావే!" "అల్లుడుగారు ఆఫీస్ కు వెళ్ళారా?" "అవును.. " "వొంట్లో ఎలా ఉందే?.. ఏమైనా విశేషం ఉందా?" "అప్పుడే ఏమిటే అమ్మ! ఇంకా టైం ఉంది లే" "ఇప్పుడు కాలం పిల్లలు ఏమిటో!.. చాలా టైం తీసుకుంటారు.. పనిమనిషి వొస్తుందా?" "ఇందాకలే వచ్చి వెళ్ళింది.. " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/nZgczQqQlwg

10-21
07:27

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 7 | Prema Entha Madhuram Episode 7 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 7' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 16/10/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుశీల వంట ముగించుకుని.. రెండు అప్పడాలు వేయించింది.. "ఏమండి! రండి భోజనానికి.. కలసి భోజనం చేద్దాం! అలా చూడకండీ! ముందు.. ఈ భోజనం చెయ్యండి" "వచ్చేసాను.. సూసీ. ఇప్పుడు చెప్పు సూసీ! ఏమిటో ఊరి కబుర్లు.. ?" "ఏముంటాయండి.. నా ఫ్రెండ్ కమల ను కలిసాను.. అది కార్ కొన్నాది.. మంచి ఫ్లాట్ తీసుకుంది.. ఇద్దరమూ అలా షికారు చేసాము.. మరచానండి.. మీ గురించి అడిగింది.. " "మొత్తం మీద ట్రిప్ ఎంజాయ్ చేసావు కదా!" ఆ రాత్రి ఇద్దరు సరదాగా మనసు విప్పి మాట్లాడుకున్నారు.. మర్నాడు మార్నింగ్.. సతీష్ ఆఫీస్ కు వెళ్ళగానే.. సుశీల కు కళ్యాణి గురించి గుర్తుకు వచ్చింది.. ఫోన్ తీసి నెంబర్ కోసం సెర్చ్ చేసింది.. కళ్యాణి జపాన్ లో ఉంటుంది కదా.. వాట్సాప్ కాల్ చేస్తాను.. "హలో.. " "హలో.. ఎవరండీ.. " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rgSOPeUxgiQ

10-16
07:39

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 6 | Prema Entha Madhuram Episode 6 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 6' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 11/10/2023 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ బెంగుళూరు చేరుకున్న తర్వాత.. శైలజ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది సుశీల.. చాలా వెతికిన తర్వాత.. అడ్రస్ దొరికింది.. అక్కడకు వెళ్ళి తలుపు కొట్టింది.. ఎవరో పెద్దావిడ తలుపు తీసింది "ఎవరు కావాలి?" అని అడిగింది "శైలజ కోసం వచ్చానండి".. "మీరు ఎవరు? మీరు శైలజ తో టచ్ లో లేరనుకుంటాను" "ఏమైంది?" "శైలజ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది" "ఎప్పుడు ఆంటీ? మీరు శైలజ కు ఏమవుతారు?" "నేను శైలజ అమ్మ" "కాలేజీ లో చదువుతున్నప్పుడే ఆత్మహత్య చేసుకుంది.. " "ఎందుకు ఆంటీ?" అప్పట్లో.. సరదాగా.. ఆడుతూ పడుతూ కాలేజీ కు వెళ్ళేది.. చదువులో వొత్తిడి తట్టుకో లేక ఆత్మహత్య చేసుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JxTvA1qgj_c

10-11
06:57

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 5 | Prema Entha Madhuram Episode 5 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 5' - New Telugu Web Series Written By Mohana Krishna Tata 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యేసరికి సతీష్ మా సీనియర్. ర్యాగింగ్ చేస్తూ, నాకు పరిచయమయ్యాడు. చాలా మంచివాడు. బాగా చదువుతాడు అని కాలేజీ అంతా టాక్. నాకూ.. అలాగే అనిపించింది. నేను సతీష్ ను చాలా ఇష్టపడ్డాను. కానీ. ఎప్పుడు తనకి చెప్పలేదు. చాలా సార్లు, సతీష్ కు ఏదో చెబుదామనుకునేదానిని..... కానీ.... నేను పొట్టిగా ఉండడం చేత.... ఆ ఫీలింగ్ నన్ను ఆపేసింది... సతీష్ మనసులో ఏముందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను... అప్పుడు అర్థమైంది నేను తనకి సరిపోను అని.... సతీష్ అందరికి చాలా హెల్ప్ చేసేవాడు.... నోట్స్ ఇవ్వడము, అన్నింటిలో చాలా గ్రేట్. తనకి, అచ్చం మీలాంటి అమ్మాయి కావాలని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది... ఎవరో ఆ అదృష్ట వంతురాలు అనుకొని నేను తన గురించి ఇంక ఆలోచించలేదు... తర్వాత నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చి, నేను వేరే ఊరు వెళ్ళిపోయాను... మళ్ళీ ఇప్పుడే, వింటున్నాను సతీష్ గురించి.... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/0zY4VME5ZPI

10-06
10:05

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 4 | Prema Entha Madhuram Episode 4 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 4' - New Telugu Web Series Written By Mohana Krishna Tata 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "తర్వాత నా పయనం ఎక్కడికో?" అనుకుంది సుశీల లిస్ట్ లో తర్వాత ఉన్న... అమ్మాయి డీటెయిల్స్ వెదికింది సుశీల. "సతీష్ ఇంటర్ చదివింది.... వైజాగ్ లో... సో, వైజాగ్ వెళ్ళాలి" అని అనుకుంది సుశీల. రాత్రికి ఫ్లాట్ కు చేరుకుంది సుశీల.. "కమల!... నేను ఇంక బయల్దేరతానే!.... " "ఇంకా కొన్ని రోజులు ఉండేవే... సరదాగా ఉంటుంది" "లేదే! నీకు తెలుసు గా... మా అయన నాకోసం కలవరిస్తున్నారు... తొందరగా నా పని ముగించుకుని వెళ్ళాలి కదా!" రాత్రి సతీష్ కు ఫోన్ చేసింది.... సుశీల. "ఏమండీ! ఎలా ఉన్నారు? ఇంటికి వచ్చారా? డిన్నర్ అయ్యిందా?" "సూసీ! అయ్యింది డిన్నర్! ఆఫీస్ నుండి ఇందాకలే వచ్చాను... నిన్ను చూసి త్రీ డేస్ అయ్యింది సుశీల! రాత్రి ఒక్కడినే పడుకోలేకపోతున్నాను! ఎప్పుడు వస్తున్నావు? "ఇంకో 2 డేస్ అండి... వచ్చేస్తాను.... మా ఫ్రెండ్ ఉండమంటూ బలవంతం చేస్తుంది" "టేక్ కేర్ సూసీ” *** "కమలా! నా బట్టలు ప్యాక్ చేసావా బ్యాగ్ లో?” "మేడ మీద ఆరేసి ఉన్నాయే... తీసుకొస్తాను ఉండు…” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zMBlK9ET1nQ

10-01
08:39

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 3 | Prema Entha Madhuram Episode 3 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 3' - New Telugu Web Series Written By Mohana Krishna Tata 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "మరీ అడుగుతున్నావు కదా! చెబుతున్న".. అని అంతా చెప్పింది సుశీల "పోవే, మీ అయన.. చాలా మంచి మనిషి.. నువ్వు ఇలాగ అనుమానించడం నాకు నచ్చలేదు" "అనుమానం కాదే, మా అయన బాధ పోగొట్టాలని ఈ ప్రయత్నం కమల!" "ఓకే, మరి ఏమిటి చేద్దాము అనుకుంటున్నావు? "రేపు మా ఆయన చదివిన స్కూల్ కి వెళ్ళాలనుకుంటున్నా!" "నాకైతే ఆఫీస్ ఉందే.. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు" "అలాగే కమల" ఈలోపు బెల్ మోగింది. తలుపు తీసింది కమల. “పిజ్జా వచ్చిందే సుశీల! కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్!” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/aV_WWub9vbY

09-26
08:11

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 2 | Prema Entha Madhuram Episode 2 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 2' - New Telugu Web Series Written By Mohana Krishna Tata 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ సుశీల, భర్త ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత, ఎందుకో రూమ్ లోకి వెళ్ళి భర్త వర్కింగ్ టేబుల్ ఓపెన్ చేసింది.. ఒక డైరీ కనిపించింది. చూస్తే, పాత డైరీ లాగా ఉంది. ఓపెన్ చెయ్యాలా?.. వద్దా అని చాలా సేపు ఆలోచించింది.. ఓపెన్ చేస్తే.. మా ఆయనను నేను అనుమానించినట్టు ఉంటుందేమో? మళ్ళీ పర్వాలేదనుకుంది.. మా ఆయనకు నేను హెల్ప్ అవుతానేమో అనుకుంది సుశీల.. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది.. ఎవరో? అనుకుంటూ తలుపు తీసింది. "నువ్వా కాంతం!" "ఇల్లు తుడిచి, తడిగుడ్డ పెట్టు.. నేను లోపల వంట చేసుకోవాలి" "అమ్మగారు! ఒక విషయం ఆడాలి.. " "ఏమిటో చెప్పు" "నాకు రేపు పెళ్ళిచూపులు. కొంచం డబ్బులు కావాలి.. " "పెళ్ళి కొడుకు ఎవరో"? "మా బావ అమ్మగారు" Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4KxrrrQhReI

09-21
09:28

ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 1 | Prema Entha Madhuram Episode 1 | Telugu Web Series | Mohana Krishna Tata | manatelugukathalu.com

'Prema Entha Madhuram Episode 1' - New Telugu Web Series Written By Mohana Krishna Tata 'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: తాత మోహనకృష్ణ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "గుడ్ మార్నింగ్ సుశీల డియర్!" అని బెడ్ మీద నుంచి లేస్తూ, పక్కనే ఉన్న తన శ్రీమతి తో అన్నాడు సతీష్. "గుడ్ మార్నింగ్ శ్రీవారు!" "రోజు రోజు కు నీ అందం పెరిగిపోతుంది సుశీల.. నా కళ్ళకు అప్సరస లాగా ఉన్నావనుకో!" "ఇంకా.. చెప్పండి.." "నేనంటే.. నీకెంత ఇష్టమో చెప్పు డియర్.." "రోజూ ఉదయమే ఈ ప్రశ్న అడుగుతారు మీరు.. మీరంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం అండీ.. శ్రీవారు" అంటు బుగ్గను గిల్లి.. “నేనింక లేవాలండీ.. మీతో కబుర్లు చాలు ఇంక.." గ్లాస్ డోర్స్ కు ఉన్న కర్టెన్ పక్కకు లాగితే, తెల్లవారి సూర్య కిరణాలు లోపలి రూమ్ లోకి తాకుతున్నాయి. ఆ వెలుగు సుశీల ముఖం పై పడి ఆమె ముఖం ప్రకాశిస్తుంది. సతీష్ సుశీల ది ఒక గేటెడ్ కమ్యూనిటీ లో అపార్ట్మెంట్.. చుట్టూ.. చెట్లు.. మంచి గాలి వెలుతురు బాగా వస్తాయి. సతీష్ ఇష్టపడి తీసుకున్నాడు ఆ ఫ్లాట్. సుశీల చామనఛాయ గా ఉన్నా, ముఖం కళ గా ఉంటుంది. దానికి తోడు, ఆ చిరునవ్వు.. ఒక పెద్ద అలంకారం. సుమారు గా పొడవు, విశాలమైన నుదురు, మధ్య పాపిడి, పాపిడి బొట్టు, చేతులకి గాజులతో లక్షణంగా ఉంటుంది. మెడలో గొలుసు ఆమె అలంకారానికి ప్లస్ అనే చెప్పాలి. సతీష్.. సుశీల కు పెళ్ళై ఆరు నెలలు అయ్యింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/w9lLT6M8JUc

09-16
08:20

Recommend Channels