తల్లి పాల బ్యాంకు (Mothers milk bank)
Description
బిడ్డ ఆకలితో అల్లాడినా.. తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే బాలింతలు, బిడ్డలు దూరమైన తల్లులు చనుబాలను దానం చేస్తున్నారు.
తల్లి పాలు అందని పిల్లల కోసం వేరే మహిళ Breast milk feed cheyyatam మనకు తెలుసు . శతాబ్దాలుగా వాడుకలో ఉన్నదే . పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ బాలింతలు చిన్నారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు
గతం లో వాడుకులో ఉన్నా కూడా తల్లి పాల దానం లేదా ఇతర పిల్లలకు అదనంగా ఉన్న పాలను ఇవ్వటం కాలక్రమేణా కనుమరుగు అవుతూ వచ్చింది . తల్లి పాలకు ఇతర వాణిజ్య మిల్క్ substitute కాదు . ఆరోగ్యపరంగా కూడా బెస్ట్ మదర్ మిల్క్ .
ఎక్కువగా మిల్క్ వచ్చే తల్లులు తమ శిశువు తాగాక మిగిలింది ఏమిచెయ్యాలి ? ఏదైనా కారణంగా శిశువు ను కోల్పోయిన తల్లుల lactation pain ఎలా తీరుతుంది ? మిల్క్ డొనేషన్ ఎవరు ? ఎలా చెయ్యాలి ? ఎలా వాటిని స్టోర్ చేసి పంపాలి ? డోనర్ ఆరోగ్యానికి ఇబ్బందా ? రెసిపెంట్ అంటే ఆ పాలు తాగే బేబీ కి ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా ? ఎవర్ని సలహా అడగాలి ? డబ్బా పాలు సరిపడవా ?తల్లి పాలే ఎందుకు ఇవ్వాలి ? అందుకు డబ్బు ఇవ్వాళా ? అనేక ప్రశ్నలు ,అనుమానాలుకు సమాధానం ఇస్తూ తల్లి పాల అవసరాన్ని , తల్లి పాల దానం గొప్పతనాన్ని చెబుతూ తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసి పిల్లల ప్రాణాలు ఆరోగ్యం కాపాడుతున్న ధాత్రి mothers milk bank గురించిన వివరాలు ఇవ్వాల్టి సమాచారం సమీక్ష లో ధాత్రి founder director Dr . సంతోష్ కుమార్ క్రాలేటి గారి ఇంటర్వ్యూ లో తెలుసుకుందాము.
See sunoindia.in/privacy-policy for privacy information.







