బాబా కాకి రూపమున వచ్చి కాపాడుట–Audio
Description
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
శ్రీ కంఠం కృష్ణమూర్తిగారు సాయి అంకిత భక్తుడు. వారు చెప్పిన సాయిబాబా అద్భుతలీల తెలుసుకుందాము.
శ్రీమతి సంకా విజయ లక్ష్మిగారు శ్రీ సాయిబాబా యందు విశ్వాసముగల భక్తురాలు.
ఆమె వివాహము గుంటూరు అరండల్ పేటలో గల సాయిబాబా మందిరములో జరిగినది. వీరి ప్రక్క ఇంటివారు బావికి ఎలక్ట్రికల్ మోటారు పెట్టారు.
దీని వైరు ప్రక్కనే గుడ్డలు ఆరవేసే వైరుకు తగిలి ఆవైరులోకి విద్యుత్ ప్రసారమయ్యింది.
అది తెలియని విజయలక్ష్మిగారు కుమార్తె గౌనును ఆ తీగ మీద ఆరయేయ ఆమెకు కరెంటు షాకు కొట్టి ఆగౌనుకు చేయి అతుక్కుపోయి విలవిలలాడసాగినది.
ఆ బాధలో కూడ ‘సాయి బాబా’ ‘సాయి’… అని అంటూనే యున్నది. అచట ఎవరు వినేవారు లేరు.
ఇంతలో ప్రక్కనే గోడకు ఆనించి యున్న వెదురు బొంగుపైకి ఒక కాకి వచ్చి వాలగానే ఆ బొంగు కదలి వాలుతూ విజయలక్ష్మిగారి కాలిమీద పడినది.
ఆ బొంగు పడగానే ఆమె చేయి కరెంటు తీగ నుండి విడివడినది. ఇది కాకతాళీయమా? కాదు. ఆ బొంగు ఆమెను కరెంటు నుండి వేరు చేసినది.
అ బొంగును కదలించినది కాకి. ఆ కాకిని ఎవరు ఆజ్ఞాపించిరి? ఇది సాయిబాబా లీలయే. తన భక్తురాలిని బాబా రక్షించారు.
అన్ని రూపములు తానైనను, కాకి రూపమున తానె వచ్చారో, ఒక కాకిని తన భక్తురాలిని రక్షించుటకు బాబాయే పంపారో ఆయనకే ఎఱుక. శ్రీ కంఠం కృష్ణమూర్తిగారనునది ఇది శ్రీ సాయిబాబా లీలయే అని. అది యదార్దమే.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( ఫిబ్రవరి – 2016)Similar Miracles:
- ఒకటి రెండు క్షణాలలొ కరెంటు వచ్చి, బాబాను నేను నమస్కరించగానే కరెంటు పోయినది…Audio
- పూలమ్మగారిని షిరిడీ వెళ్ళమని బాబా వారు చెప్పుట
- సాధు రూపంలో బాబా వారు వచ్చి పాము బారినుండి కాపాడుట
- బాబావారు పూలమ్మగారిని షిరిడి వెళ్ళమని చెప్పుట.
- నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio




