ఆరాత్రి కలలో బాబా కన్పించి ఎందుకు భయపడతావు?–Audio
Description
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
అనుభవం:1
నేను కర్లపూడిలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడు చింతవరంలో రోడ్డు సరిలేని కారణంగా బస్సు సరిగా వచ్చేది కాదు.
నేను స్కూలుకీ 9 గంటలకు చేరుకోవార్ల. ప్రతిరోజు బాబా గుడికి వెళ్ళి స్కూలుకి వెళ్లేదాన్ని. బస్సు రాని కారణంగా ప్రతిరోజు వాంజీవాకా రోడ్డు దాకా నడిచి వెళ్ళాల్సి వచ్చేది అందువల్ల టైం సరిపోక రోజు బాబా గుడికి వెళ్ళలేక పోయే దాన్ని, వాంజీవాకా రోడ్డు దగ్గరగాలా వినాయకుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేదాన్ని ఒక రామోజు వినాయకుడి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ, బాబా నీ మందిరానికి రోజు రాలేకపోతున్నానని బాధపడ్డాను.
ఆరోజు రాత్రి కలలో వినాయకుని చేతిలో నుండి ఊదీ నా చేతిలో పడుతొంది. వినాయకుని దగ్గర బాబా లేదని ప్రదక్షిణ చేసినందుకు క్షమాపణ చెప్పుకున్నాను.
అనుభవం:2
పిలిస్తే పలుకుతా….తలిస్తేదర్శనమిస్తా
డాక్టర్ కి చూపిస్తే గూడూరుకు వెళ్ళి రమణయ్య డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించామని చెప్పారు.
గూడూరుకు వెలితే ఆపరేషన్ చేయాలనీ చెప్పి మందులు రాసిచ్చారు. రెండోసారి హాస్పిటల్ కు వెళ్ళిటప్పుడు బాబా దగ్గర చీటీలు వేస్తే ఇప్పుడు ఆపరేషన్ చేయించవద్దు అని వచ్చింది.
డాక్టర్ దగ్గరకు వెళితే ఎక్స్ రే తీశారు. కాలిలో ఏమి కనిపించలేదు. ఇలా మూడుసార్లు ఎక్స్ రే తీసినా మూడుసార్లు ఏమి కనిపించలేదు.
ఇంటికి వచ్చేశాము. అందరూ ఆడపిల్ల కదా ఆపరేషన్ చేయించామని చెప్పారు. బాబా నన్ను ఏమి చేయమంటావు అని అనుకోని రాత్రి పడుకున్నాను.
ఆరాత్రి కలలో బాబా కన్పించి ఎందుకు భయపడతావు? అని నా తలలోని పక్కపిన్ను తీసుకొని పాపకి గడ్డ ఉన్న చోట గుచ్చి తెల్లని పీచువంటి దాన్ని తీసి ఇదిగో చూడు ఏమీకాదు అని చెప్పారు.
తెల్లవారి హాస్పిటల్ కి వెళ్ళి ఆపరేషన్ చేయించాను.కలలో బాబా చేయూపినట్లుగానే తెల్లని పీచులాంటి దానిని తీసి డాక్టర్ గారు నాకు చూపించారు.
బాబాను నమ్మినవారి ఇంటిలో కొలువైఉంటారని పిలిస్తే పలుకుతారని! తలిస్తే దర్శనమిస్తారని నిదర్శనమైంది.
సింగిరి సుజాత, ఉపాధ్యాయిని,
కోట, నెల్లూరు జిల్లా
సంపాదకీయం: సద్గురులీల (ఫిబ్రవరి – 2015)
Similar Miracles:
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- ఇప్పుడు నా భర్తకి గండం ఏమిలేదు. అది బాబా నాకు చెబుతున్నట్లుగా అనిపించింది.
- కష్టములొ ఉన్న భక్తురాలికి, మరచిన మ్రొక్కును గుర్తు చేసిన బాబా వారు….
- ఆమె జీవితం బాబా యొక్క బహుమతి
- భక్తురాలి ఆపరేషన్ జరుగుతున్నంత సేపు, భయం తెలియకుండా షిరిడి దర్శనం చేయించిన బాబా వారు




