DiscoverSai Baba Leelasస్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio
స్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio

స్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio

Update: 2024-04-24
Share

Description


This Audio Prepared by Mrs Lakshmi Prasanna


ఒకసారి రాధాకృష్ణ స్వామీజీ షిరిడీ వెళ్లారు. అక్కడ భక్తులైన ఒక కుటుంబమువారు స్వామీజీని తమ ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచిరి. స్వామీజీ భోజనంలో కారము ఎక్కువయున్న భుజించరు.


అందువలన వారు అంగీకరించుటకు వెనుకాడిరి. మరుసటి రోజున భోజన సమయమునకు ఆదంపతులే ఆహారమును తీసుకొని రాధాకృష్ణస్వామీజీ యున్నగది లోనికి వచ్చిరి.


ఆ దంపతులతో భర్త “గత రాత్రి సాయిబాబా తనకు స్వప్నమున కనిపించి ప్రస్తుతము షిరిడీలోయున్న బెంగుళూరు, మద్రాసు స్వామీజీకి భోజనము పెట్టమని, ఏ ఏ పదార్థాలు వండి వడ్డించవలెనో, పెరుగుతో సహా చెప్పినారు” అని స్వామీజీకి ఆతను చెప్పెను.


స్వామీజీ ఆశ్చర్యమునొందెను. స్వామీజీ ఆ ఆహారమును భుజించినాడు. అది తాను భుజించు ఆహారవిధానముగా తగియుండుట గ్రహించాడు.


వారికి తాను చెప్పక పోయినా, బాబాయే చెప్పి చేయించుట, రాధాకృష్ణస్వామి బాబా యొక్క పూర్తి అనుగ్రహము పొందిన భక్తుడని అర్థమగుచున్నది కదా!


ఇది ఒక ప్రత్యేకమైన లీల. ఒకరోజు తెల్లవారు ఝామున గం 3.30 నిమిషములకు రాధాకృష్ణ స్వామీజీకి ఒక స్వప్నదర్శనమొచ్చినది.


ఆ స్వప్నమున శ్రీ సాయి బాబా, రమణ మహర్షి, అద్ది శంకరుడు, నరసింహస్వామిజీ వీరి గదిలో కూర్చుని యుండిరి.


“బాబా! భగవద్గీత గురించి మీ అభిప్రాయమేమి?” అని రాధాకృష్ణస్వామి శ్రీ సాయిబాబానడిగెను.


శంకరుని అడుగుమని బాబా స్వామీజీకి చెప్పిరి. స్వామీజీ శంకరుని అడుగగా “గీత, గంగ, గాయత్రి” అను ఈ మూడు మానవులను తరింపజేయునని శంకరుడు స్వామీజీకి చెప్పెను.


అప్పుడు బాబా మరియొక ‘గ’ కారమును చేర్చవలెననుచు అది ‘గ’ అని అనగా గణపతి అని బాబా చెప్పిరి.


బాబా చెప్పిన ఈ మాటలకు శంకరుడు ఆనందించిరి. ఈ విధముగా స్వామిజీ స్వప్నమున శ్రీ సాయిబాబా మరి ముగ్గురితో దర్శనమిచ్చి అనుగ్రహింపజేసిరి.


శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము


సంపాదకీయం: సద్గురులీల (మే – 2015)


ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.comSimilar Miracles:



Comments 
In Channel
The Leela of the Coin

The Leela of the Coin

2024-04-18--:--

loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

స్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio

స్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio

Sai Baba