“నాకు పెట్టకుండా మీరందరూ భుజించితిరా” అని బాబా గుర్తుచేయుట–Audio
Description
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
కేశవయ్య గారి ఇంట్లో ఏమిచేసుకున్నా బాబాకు పెట్టుదురు. ఒకరోజు వారిఇంటిలో హొళిగలను చేసుకొనిరి, మడికట్టుకుని తయారుచేయనందున వాటిని బాబాకు నైవేద్యము పెట్టకయే వారు భుజించిరి.
ఆరోజు రాత్రి బాబా స్వప్నమున కేశవయ్య గారికి కనిపించి “నాకు పెట్టకుండ మీరు హొళిగలను తింటిరి” అని జ్ఞాపకము చేసిరి.
వీరు తాము మహాపరాధము చేసినామని, క్షమింపుమని బాబాను ప్రార్ధించిరి.
మరోరోజు మరల హొళిగలను తయారు చేయించి బాబాకు నైవేద్యము పెట్టారు.తమకు జరిగిన అద్భుత లీలలను అప్పట్లో కేశవయ్యగారు ఆలిండియా సాయి సమాజ్ వారు ప్రచురించు సాయి సుధలో ప్రచురింపజేసిరి.
అప్పటి శనగల కథలో నేను ఎల్లప్పుడు నీ చెంతలేనా? నీవు తినుటకు ముందు నాకు పెట్టుచున్నావా! అని బాబా హేమాడ్ పంత్ ను హెచ్చరించుట చూచితిమి కదా! మనము కూడా బాబాకు సమర్పించక ఏమి తినరాదని గుర్తుంచుకుందుముగాక.
శ్రీ సాయిబాబా కాఫీ త్రాగుట
నాకు యిప్పుడు ఒక అద్భుత లీల గుర్తుకు వచ్చినది. కానీ విని ఎరుగని లీల. ఒక రోజున పూలమ్మగారు రేపల్లెలో శ్రీవేమూరు వెంకటేశ్వర్లుగారి ఇంటికి వెళ్ళినది. వారిద్దరు బాబా అంకితభక్తులు కదా! బాబాను గురించి మాట్లాడుకుంటుయుండగా వెంకటేశ్వర్లుగారి భార్య మూడు కప్పులతో కాఫీ తెచ్చి ఒక కప్పు అక్కడే యున్న బాబా పాఠం వద్ద పెట్టినది,
ఒక కప్పు వెంకటేశ్వర్లుగారికి, ఇంకొకటి పూలమ్మగారికి ఇచ్చి లోపలకు వెళ్ళినది. వెంకటేశ్వర్లు గారు కప్పు చేతిలో యున్నను కాఫిత్రాగుట లేదు.
ఆయన త్రాగనిదే పూలమ్మగారు త్రాగక యట్లెయున్నది. కొద్దిసేపైనా తరువాత వెంకటేశ్వర్లుగారు బాబా పటము వైపు చూస్తూ “తండ్రి త్రాగవయ్యా! ఎంతసేపయ్యా” అనుచుండెను. కొంచెము సమయములో బాబా పటము యొద్దయున్న కప్పులోని కాఫీ మాయమైనవి.
అనగా బాబా త్రాగిరి. ఎంత ఆశ్చర్యము. ఇట్లు ఇప్పట్లో ఎక్కడ జరుగును? ఈ సంఘటనతో పూలమ్మ గారు కూడ ఆశ్చర్యపోయిరి. అప్పుడు వారిద్దరు కాఫిత్రాగిరి.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల (ఫిబ్రవరి – 2015)Similar Miracles:
- బాబా స్వప్నంలో మా ఇంటికి వచ్చి మేము ఇచ్చిన కాఫీని స్వీకరించారు-17
- ” ఓ దత్త సాయి” నా బాబు రాహుల్ ను మీరే రక్షించాలి
- అయన మామూలు వాడు కాదు. బాబా యే అయివుంటాడు.—Audio
- నా కోరిక ప్రకారం బాబా వారి వెన్నముద్ద ప్రసాదాన్ని గురువుగారు నాకు ప్రసాదించారు.
- ఆ రోజు రాత్రి కలలో బాబా కన్పించి నాకు సెకండ్ హ్యండ్ మైకు సెట్టు ఒద్దు–Audio




