Keys to Godly Parenting - పిల్లలను దేవునిలో ఎలా పెంచాలి?
Description
యోధుని చేతిలో బాణములు
తల్లిదండ్రులు మరియు సంరక్షకుల కోసమైన ఈ అమూల్యమైన సందేశంలో, పాస్టర్ బెంజమిన్ జూనియర్ గారు దైవిక పెంపకం గురించి ముఖ్యాంశాలను పంచుకుంటున్నారు. ప్రత్యేకముగా దృష్టి సారించాల్సిన ముఖ్యమైన రంగాలను నొక్కి చెబుతూ, భావోద్వేగపరంగా స్థిరంగా ఉండే పిల్లలను పెంచడానికి ఆచరణాత్మక మార్గాలు మరియు పిల్లల పెంపకములో నివారించాల్సిన సాధారణ లోపాలను తెలియజేస్తున్నారు.
మీరీ సందేశాన్ని వింటూండగా తల్లిదండ్రులుగా మీ విశేషాధికారాన్ని స్వీకరించి, పదునుపెట్టబడి, చక్కగా రూపింపబడి మరియు శిక్షణ పొంది, పూర్తిగా సన్నద్ధమై ఈ లోకములోనికి ప్రవేశపెట్టబడిన పిల్లలను పెంచడానికి మీరు కట్టుబడి ఉంటారని మేము ప్రార్థిస్తున్నాము.
దైవికమైన జీవితాన్ని మాదిరి చూపించుట ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చే తరాన్ని పెంచే యోధులుగా ఉండుటకు దేవునిచే పిలువబడిన వారిగా మీరు ఉందురు గాక. ఆమేన్!