17. Anuvadinchadam Antha Veasy Kadu
Description
Kathalu. Kaburlu S03E016
నాకు అనువాదాలు చేయడం అంటే ఆసక్తి. వికీపీడియాలో నా contributionsలో అత్యధిక శాతం అనువాదాలే. అదే ఇష్టంతో ప్రముఖ భారతీయ ప్రకృతి ప్రేమికుడు, man eater పులుల వేటగాడు జిమ్ కార్బెట్ రచనలను తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టాను. ఆయన maneater hunting అనుభవాలు ఎంతో ఆసక్తికరంగా, ప్రతి నిమిషం ఉత్కంఠతో సాగుతాయి. పులి కోసం వారాలకు వారాలు రాత్రి పూట నిద్ర మానేసి పడిగాపులు పడడం. వానలో, చలిలో రాత్రి పూట చెట్లపై కదలకుండా గంటలు గంటలు గడపడం. అంతటి అగాధమైన అడవిలో పుట్టే ప్రతి కదలికనూ అత్యంత శ్రద్ధతో గమనించడం వంటివి చదివితే ఒళ్ళు జలదరిస్తుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కు అతి సమీపంలో ఉన్న రుద్రప్రయాగ్ ప్రాంతాల్లో, క్షేత్రానికి వచ్చే భక్తులను వేటాడుతున్న పులిని ఎలా చంపారో ఒక కథ ఉంటుంది. అందులో పులి సాధారణంగా సంచరించే ప్రదేశంలో, దానికి కనపడకుండా ఒక మంచెపై కొన్నాళ్ళు, ఒక చెట్టుపై కొన్నాళ్ళూ రాత్రి పూట ఆయన గడిపాను అని రాశారు. నాకు అలా రాత్రుళ్ళు, చీకట్లో ఒక్కళ్ళే ఆరుబయట ఎలా ఉంటార్రా బాబూ అనుకున్నానే తప్ప, అసలు విషయం ఈ మధ్య తెలిసింది.
ఈ మేనెల రెండవ వారం మేము కేదార్, బదరీ యాత్రలకు వెళ్ళాం. అందరికీ తెలిసిందే, కేదార్ నాథ్ రుద్రప్రయాగ్ జిల్లాలో భాగం. అసలు ఆ ప్రాంతాలకు దగ్గరవుతున్న కొద్దీ temperature పడిపోతూ ఉంటుంది. కేదార్ కొండ కింద రామ్ పూర్ అనే ఊరు ఉంది. సోన్ ప్రయాగ్ కి దాదాపు 10కిలోమీటర్ల దూరం. సోన్ ప్రయాగ్ అంటే కేదార్ యాత్రకు ప్రధమ ప్రదేశం అన్నమాట. మేము రాత్రి 11గంటల ప్రాంతంలో మా టెంపో నుండి రామ్ పూర్ లోని హోటల్ దగ్గర దిగాం. ఒక్క క్షణం చర్మం కోసుకుపోతుందేమో అన్నంత చలి పెట్టింది. పరుగులు పెట్టుకుంటూ హోటల్ లాబీలోకి వెళ్ళాం. గబగబా మా హాండ్ బ్యాగ్ లలో దొరికినవి దొరికినట్టుగా కప్పేసుకున్నాం.
వామ్మో అదేం చలి నాయనోయ్. తరువాతి రోజు ఉదయం ఆ చలిలో థర్మల్స్, డ్రస్, స్వెటర్, జర్కిన్ లు వేసుకుని, గ్లౌజులు, బూట్లు తొడుక్కున్నా ఇంకా ఒణుకుతూనే ఉన్నాం. అప్పుడు అనిపించింది, ఆ మనిషి ఇలాంటి చలిలో పులి కోసం మంచెలపైనా, చెట్లపైనా కనీసం కదలకుండా, రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎలా ఎదురు చూశాడురా బాబూ. అసలు ఈ చలికి బుర్ర పని చేయకపోతుంటే, ప్రతి ఆకు కదలికని సైతం ఎలా గమనించాడురా నాయనా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ కథలు తీసి చదువుతుంటే ఆ కష్టం, శ్రమ మరింత బాగా అర్ధం అవుతున్నాయి.
ఇన్ని ఉంటాయి అనువాదం అంటే. ఇన్నే కాదు ఇంకా చాలా. అసలు పదానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక భావం convey చేయాలంటే మన భాషలోని పదానికి అంతటి లోతు, గాంభీర్యత ఉన్నాయా లేదా? లేదంటే ఈ పదానికి వేరే synonyms ఉన్నాయా? లాంటి సందిగ్ధాలు కేవలం పదాలకు చెందినవి మాత్రమే. అసలు ముందు మనం అనువదించే రచయితను పూర్తిగా, ఉన్నది ఉన్నట్టుగా accept చేయాలి. వారి ఆలోచనలను, వ్యక్తీకరణను మనం own చేసుకోవాలి. ఇలా ఎన్నో. అవేంటో ఈ శనివారం 'అనువాదం 101' ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం.
మంటో లాంటి సంక్లిష్టమైన వ్యక్తిత్వం, రచనా శైలి కలిగిన రచయితను అర్ధం చేసుకుని, అందంగా అనువదించడం అంటే మాటలు కాదు. అలాంటి గొప్ప ఫీట్ సాధించిన ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, ఎలమి ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణిమ తమ్మిరెడ్డి గారు అనువాదం చేయడంలో ఉండే కష్ట సుఖాలు, సరదా సంగతులు, సంక్లిష్టతలు ఇలా ఎన్నిటినో మనతో పంచుకోనున్నారు. ఈ శనివారం ఉదయం 9.30కల్లా వచ్చేయండి మరి. ఈ విషయమై నేను రాసిన న్యూస్ లెటర్, నేను చెప్పిన పాడ్ కాస్ట్ ఈ కింది లింకుల్లో. ముందు ఇవి వినేయండి చెప్తా.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
https://www.dasubhashitam.com/blog/anuvadinchadam-antha-veesi-kaadu
🙏🏻
మీనా యోగీశ్వర్
#కథలు_కబుర్లు । 29.05.2024