21. Telugu Chanipotunna Bhasha?
Description
Kathalu. Kaburlu S03E21
*తెలుగు ఉద్యోగమిచ్చింది*
తెలుగు రాయడం చదవడం వచ్చు, కొంత వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయడం వచ్చు. (ఇంకా చాలా నేర్చుకోవాలి) ఏవో ఫేస్బుక్ లో రాస్తూ ఉంటాను. సందర్భానుసారం చిన్న చిన్న మీమ్స్ చేస్తూ ఉంటాను . ఇంతే మన రెజ్యూము.
నేను రాసేవి చూసి పవన్ సంతోష్ అన్నయ్య ఫోన్ చేసి. ఏమయ్యా రామూ ఆ రాసేది ఏదో వికీపీడియాలో రాయవయ్యా అన్నారు. నేను రాయలేదు. తర్వాత తెలుగు కొరా మొదలయ్యాక ఆ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో రాసేవి తెచ్చి కోరాలో రాయవయ్యా బాబూ అన్నారు. ఏ హంపికో ఎల్లోరాకో వెళ్ళి ఏదో ఒక ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెడితే చూసి "బాగుందయ్యా తీసుకొచ్చి కొరాలో రాయి నీకు రీచ్ బాగా వస్తుందయ్యా అంటూ instagram రీల్ లో సమీరా భరద్వాజ్ గారిలా "చెప్పిన మాట వినయ్యా" అని అన్నీ రాయించాడు.
ఎప్పుడైనా సీరియస్ గా ఏ మార్వెల్ కామిక్సో, డీసీ కామిక్సో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించో మాట్లాడుతూ ఉంటే "బాగుందయ్యా ఓ పని చేద్దాం తెలుగు కొరాలో దీని మీద ఒక వేదిక పెట్టేద్దాం. నీకు తెలీదయ్యా ఇవన్నీ చదివే వాడు ఉన్నాడు రాసేవాడే లేడు. ఇప్పుడు నువ్వు ఉన్నావ్ గా రాసి పడేయ్. కోరానే అందరికీ చేరుస్తుంది. రాయవయ్యా తెలుగులో రాయి." *ఇలా రాముడు రాయిని ఆడది చేసినట్లు ఈ పవన్ అన్నయ్య, మీనక్క, ఇప్పుడు మన దాసుభాషితం కలిసి రాయి రాయి రాయి అని చెప్పి రాయి లా ఉన్న నా బుర్రని రాముణ్ణి చేసారు.*
తెలుగులో రాయగలిగే శక్తి యుక్తి ఉంటే ఎక్కడో ఒక రోజులో మాయమైపోయే దాంట్లో ఎందుకు రాయడం. వెతికితే దొరికే దాంట్లో, మళ్లీ మళ్లీ తిరగతోడె దాంట్లో, రాసినదానికి ఒక గుర్తింపు అంటూ ఇచ్చే దాంట్లో తెలుగులో రాస్తూ ఉంటే ఆ తెలుగు అలా వెలుగుతూ ఉంటుందయ్యా. కాలక్షేపానికో, సరదాకో నీకు తెలిసింది రాస్తూ ఉండూ. నా గోలేంటో తెలుసా రామోజీ రావ్ (అవును గోలే) మనం కూడా రామోజీ రావులా ఒక పెద్ద సంస్థ పెట్టి తెలుగులో రాసే వాళ్ళకి, తీసే వాళ్ళకి, విషయాలు సృష్టించేవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, సత్కారాలు, సన్మానాలు చేయడమేనయ్యా అని చెప్పి, అలా తెలుగులో రాయించి, అది చూపించి తీసుకొచ్చి దాసుభాషితంలో చేర్చి, ఏమయ్యా తెలుగులో ఉద్యోగాలు లేవని ఎవడయ్యా అన్నాడు ? అని అడిగారు. కథలు, వ్యాసాలు, సినిమాలు, వీడియోలు అవసరమైతే ఉద్యోగాలు కూడా మనమే క్రియేట్ చేద్దాం అయ్యా అని కూడా చెప్పాడు. కాకపోతే ఇవాళ కాకపోవచ్చు కానీ రేపు అవుతుందయ్యా అని చెప్పిన పవన్ అన్నయ్య కి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు.
తెలుగుకొరా నుంచి ఇప్పుడు తెలుగాట వరకు తెలుగు నన్నిలా తీసుకువచ్చిన ప్రయాణం ఇది. కానీ మరి తెలుగు చనిపోతున్న భాషా ? అది కూడా చదవడానికి, లేదా వినడానికి ఈ Podcast, Blog లింక్స్ ని క్లిక్ చేయండి.
Blog : https://www.dasubhashitam.com/blog/telugu-chanipothunna-bhasha
Podcasst : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
🙏
రామ్ కొత్తపల్లి
#లోకాభిరామం | జులై 4, 2024
www.dasubhashitam.com