18. Manto Tho Kalisi Yedchanu
Description
Kathalu.Kaburlu S03E18
నువ్వెలా ఇంత గొప్పవాడివి అయ్యావు బాబూ ? #TheBear
ది బేర్ సిరీస్ లో లూకా అనే ఒక ప్రఖ్యాత చెఫ్ దగ్గరికి వంటలో మెళుకువలు నేర్చుకోడానికి వెళ్ళిన మార్కస్ అనే కుక్ * అసలు నువ్వు ఈ పనిలో ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావు* అని అడిగితే లూకా చెప్పిన మాటను నేను ఇక్కడ కోట్ చేస్తాను, క్షమించాలి నా పద్దతిలో "అనువాదం" చేస్తాను.
నేను నాకు తెల్సిన పనిని త్వరగా చేయడం మొదలు పెట్టాను, చాలా దెబ్బలు, తిట్లూ తిన్నాను, నా రంగంలో నాకంటే గొప్పవాళ్ళని మహా మహులని చూసి నేర్చుకున్నాను, కలిమితో, చెలిమితో వారిని అనుసరించాను. నేనెప్పటికీ వాళ్ళంత గొప్పవాడిని కాలేనని గ్రహించాను. కానీ వారిని అనుసరిస్తూ ఉంటే తర్వాతి తరాలకైనా నేను గొప్పవాడిగా కనిపిస్తాను అని తెల్సుకున్నాను. ఒక గొప్ప స్థానంలో ఉన్న వారిని దాటలేకపోయినా నాకంటూ నేను ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న వాడిని అవుతాను అని అర్ధం చేసుకుని నా మీద ఉన్న తలభారాన్ని దించేసుకుని నా పని నేను చేస్తూ ఇక్కడిదాక వచ్చాను.
ఈ వారం జరిగిన ప్రసంగంలో పూర్ణిమా గారి మొదటి అనువాదం నుంచి వారి ప్రయాణం చూస్తే నాకు లూకానే గుర్తుకు వచ్చాడు. వచ్చిన పనిని త్వరగా మొదలు పెట్టి, అక్షర దోషాలు తప్పులు, ఇంకా అనువాదం చేయడంలో ఎన్నో కాంట్రవర్సీలు చూసి, మొదటి కథ అనువాదం తర్వాత స్నేహితుడి నుంచి నీకు నిజంగా హిందీ వస్తే ఈ పదాలుకు అర్ధం చెప్పు, ఉర్దూ వస్తే ఆ పదాలకు అర్ధం చెప్పూ అనే ప్రశ్నలు ఎదుర్కుని, డిక్షనరీలు, ఆన్లైన్ డిక్షనరీలు తిరగేసి మొత్తానికి ఒక పుస్తకం అనువాదం చేసే స్థాయికి చేరుకుని ప్రస్తుతం ఎలమి అనే ఒక ప్రచురణ సంస్థ స్థాపించి 5 పుస్తకాలు విడుదల చేసి మరో 5 పుస్తకాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న వీరి ప్రయాణం నిజంగా ఒక మంచి మార్గదర్శకం.
ఈ నెల జరిగిన *అనువాదం 101* ప్రసంగం వీడీయో మీరు ఇక్కడ చూడచ్చు. మీ సౌకర్యం కోసం టైమ్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అనువాద పుస్తకాల మార్కెట్ ఎలా ఉంది అనే విషయం పై పూర్ణిమా గారి సమాధానం తెల్సుకోడానికి డిస్క్రిప్షన్లో ఉన్న టైమ్ స్టాంప్స్ చూడండి.
https://youtu.be/SsVw8rzwSOQ
సాదత్ హసన్ మంటో కథలు అనువాదం చేస్తూ రచయిత ఆయనతో పాటే ఎందుకు ఏడ్చారో తెలియాలి అంటే ఈ వారం కథలూ కబుర్లు చదవండి లేదా మీనక్క గొంతులో వినేయండి.
Blogpost లో ఇక్కడ: https://www.dasubhashitam.com/blog/mantotho-kalisi-yedchanu
Podcast లో ఇక్కడ: https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3