19. Vaalla Jeevitam Ika Anthena ?
Description
Kathalu.Kaburlu S03E19
చాలా కాలం తరువాత ఒక న్యూస్ లెటర్ కు స్పందిస్తూ, చాలామంది ఈమెయిల్ చేశారు. తమకు తెలిసున్నవాళ్ళలో కూడా ఇలా బాధపడినవారు, పడుతున్నవారు ఉన్నారు అంటూ. స్పందన వచ్చినందుకు ఆనందించాలో, ప్రతీవారి జీవితంలోనూ ఇలా బాధపడేవాళ్ళు ఉన్నారు అని తెలిసి బాధపడాలో అర్ధంకాలేదు నాకు. కానీ, ఒక విషయానికి మాత్రం ఆనందించాను. 'లోపం ఉన్నవాళ్ళని పెళ్ళి చేసుకోవడం అంటే వాళ్ళని ఉద్ధరించడమే కదండీ. వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించినవారికి కొద్దో గొప్పో బాధ ఉండి, వాళ్ళ మీద చూపిస్తే తప్పేముంది' అంటూ ఎవరూ స్పందించనందుకు చాలా ఆనందంగా అనిపించింది.
మీరు మరీ చోద్యం కాకపోతే, అంత వితండవాదన చేసేవాళ్ళుంటారా అంటారేమో. ఉంటారండీ బాబూ. చాలామంది ఉంటారు. వాళ్ళ దృష్టిలో దివ్యాంగులు, అన్యాయానికి గురైన బాధితులు వంటి వాళ్ళు బతికి ఉండడమే గొప్ప విషయం. మళ్ళీ హక్కులు, న్యాయాలు కూడానా అనుకునేవాళ్ళని, మొహం మీదే అన్నవాళ్ళని చూశాను కాబట్టీ చెప్తున్నాను. అందుకే దాసుభాషితం సభ్యులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఒక ఉదాత్తమైన ప్రజలకు cater చేస్తున్నందుకు. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ న్యూస్ లెటర్ చదవకపోయినా, పాడ్ కాస్ట్ వినకపోయినా ఈ కింది లింకుల ద్వారా వినండి. ఇంతకీ నవల విన్నారా? ఎంతవరకు? మీకు ఏం అనిపించింది?
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
https://www.dasubhashitam.com/blog/valla-jeevitam-ika-anthenaa
#కథలు_కబుర్లు
🙏🏻
మీనా యోగీశ్వర్ | 19-06-202